YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో పుంజుకుంటున్న వైసీపీ

విశాఖలో పుంజుకుంటున్న వైసీపీ

విశాఖలో పుంజుకుంటున్న వైసీపీ
విశాఖపట్టణం, మార్చి 13
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ...అనే విధానాన్ని తెలుగుదేశంలో పలువురు నేతలు బాగా వంటపట్టించుకున్నట్టు స్పష్టమవుతోంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే సొంత పార్టీకి గుడ్‌బై చెబుతూ వైసిపి గూట్లోకి వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం 'గోడ దెబ్బ..చెంపదెబ్బ' తగిలి ఈ ఎన్నికల్లో మూర్ఛపోయిన స్థితికి టిడిపి చేరింది. పార్టీకి సీనియర్‌ నాయకులుగా ఉన్నవారు, పార్టీ అధ్యక్ష పదవులను వెలగబెట్టిన వారు సైతం ఆ పార్టీని వీడుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ పడిపోయింది. దీంతో సీను 'రివర్స్‌' అవుతోంది. వైసిపి మాత్రం వలస వచ్చిన వారితో ఎంతకాలం నిలబడుతుందో తెలియదుగానీ తాత్కాలికంగా ఈ ఎన్నికల వరకూ బలం పుంజుకుంటున్నట్టయింది. టిడిపి నైతికంగా నైరాశ్యంలో పడింది.మొన్న రెహమాన్‌.. నిన్న తైనాల.. నేడు పంచకర్ల ఇలా ఒక్కరేంటి చెప్పుకుంటూ పోతే క్షేత్రస్థాయిలో పలువురు కార్యకర్తలు వైసిపి గూటిలోకి చేరుతున్నారు. విశాఖను రాజధానిగా చేసేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకించే విషయాన్ని ఈ నాయకులంతా ఎద్దేవా చేస్తున్నారు. అదీగాక తాజాగా మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఇండియన్‌ బ్యాంకు నోటీసులు సిద్ధం చేసి ఆస్తుల వేలానికి రికవరీకి ప్రకటనలు గుప్పించడం వంటివి విశాఖలో పార్టీ ప్రతిష్టకు మచ్చలా మారింది. గంటా అవినీతి, అక్రమాలపై తొలినుంచీ రాష్ట్రంలో విమర్శలు గుప్పుమనడం తెలిసిందే. జనసేన పార్టీ నుంచి కూడా వైసిపిలోకి ఇటీవల మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య వచ్చి చేరారు.వైసిపి ఈ సారి ఎలాగైనా విశాఖ కార్పొరేషన్‌పై జెండా ఎగరేయాలన్న వ్యూహంతో ముందస్తు చర్యలకు దిగుతోంది. గడచిన కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ముఖ్యంగా లోపాయికారీగా సంస్థాగత బలాన్ని పెంచుకునే ప్రణాళికలు వేసింది. ప్రతిపక్ష టిడిపికి చెందిన నేతలను గాలం వేసే పనిలో అధినాయకత్వం, ముఖ్యంగా విజయసాయిరెడ్డి తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి.టిడిపి నుంచి ఇటీవల వలసలు వచ్చిన వారిలో పలువురు ఆ పార్టీ అధినేత తీరుపై మండిపడి వచ్చినవారే అధికంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు విషయంలో చూస్తే విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు 'ఎ' ఫారాలు పంచే బాధ్యతను ఆయనతో నిమిత్తం లేకుండా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో పార్టీ అధిష్టానం పెట్టడంపై పంచకర్ల అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు సొంత నియోజవకర్గం నుంచి టిడిపికి ఝలక్‌ ఇవ్వనున్నారు.

Related Posts