YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 నెంబర్ 2 కు పడిపోయిన అంబానీ

 నెంబర్ 2 కు పడిపోయిన అంబానీ

 నెంబర్ 2 కు పడిపోయిన అంబానీ
ముంబై, మార్చి 13
రష్యా, ఒపెక్‌‌ దేశాల మధ్య విభేదాలు పరోక్షంగా రిలయన్స్‌‌కు నష్టం కలిగిస్తున్నాయి. పెట్రోల్‌‌ ప్రొడక్షన్‌‌ను తగ్గిద్దామన్న ఒపెక్ దేశాల ప్రపోజల్‌‌కు రష్యా ఒప్పుకోకపోవడంతో క్రూడాయిల్‌‌ మార్కెట్‌‌ షేక్‌‌ అయిన సంగతి తెలిసిందే. క్రూడ్‌‌ ధరలు బ్యారెల్‌‌కు ఏకంగా 36 డాలర్ల స్థాయికి దిగొచ్చాయి. దీంతో ప్రపంచంలోని కొంతమంది కుబేరుల స్థానాలు తారుమారయ్యాయి.  రిలయన్స్‌‌ సహా పలు ఆయిల్‌‌ కంపెనీల షేర్లు విపరీతంగా నష్టపోయాయి. రిలయన్స్ మార్కెట్ క్యాప్‌‌ దారుణంగా తగ్గిపోయింది. దీంతో ముకేశ్‌‌ అంబానీ నెట్‌‌వర్త్‌‌ తగ్గింది. ఇప్పటి వరకు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఆయనకు ఉన్న రికార్డు తొలగిపోయింది. చైనా ఈ–కామర్స్ కంపెనీ అలీబాబా ఫౌండర్‌‌ ఇప్పుడు మళ్లీ మొదటిస్థానానికి వచ్చారని బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలియనీర్‌‌ ఇండెక్స్‌‌ తెలిపింది.ఆయిల్‌‌ ధరలు తగ్గడంతోపాటు కరోనా ఎఫెక్ట్‌‌ వల్ల ఎకానమీలు దెబ్బతినడంతో అంబానీ నెట్‌‌వర్త్‌‌ విలువ 5.8 బిలియన్‌‌ డాలర్లు (దాదాపు రూ.49 వేల కోట్లు) తగ్గి 41.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.08 లక్షల కోట్లు) అయింది. జాక్ మా నెట్‌‌వర్త్‌‌ 44.5 బిలియన్ డాలర్లుగా ఉంది.  ఇది వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల అంబానీ ర్యాంకు 19 కాగా, జాక్‌‌ మా 18వ స్థానంలో ఉండేవారు. ఇప్పుడు అంబానీ ఒక ర్యాంకు కిందకు దిగారు.  పలు దేశాలు క్రూడాయిల్‌‌ ప్రొడక్షన్‌‌ను పెంచడంతో సోమవారం ఒక్క రోజే బ్యారెల్‌‌ ధర 30 శాతం వరకు తగ్గింది.  ముఖ్యంగా సౌదీ అరేబియా ధరల యుద్ధానికి దిగడమే ఈ పరిస్థితికి కారణం. ఫలితంగా రిలయన్స్‌‌  షేరు ధర సోమవారం 13.10 శాతం పడిపోయి రూ.1,104.50లకు చేరింది.   ఇప్పటి వరకు మార్కెట్‌‌క్యాప్‌‌పరంగా నంబర్‌‌వన్‌‌ స్థానంలో ఉన్న ఈ కంపెనీ రెండోస్థానానికి పడిపోయింది. రూ.7.40 లక్షల కోట్ల మార్కెట్‌‌క్యాప్‌‌తో టీసీఎస్‌‌ మొదటిస్థానంలోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్‌‌ రిఫైనింగ్‌‌ కాంప్లెక్స్‌‌ను నడిపే రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌లో అంబానీకి 42 శాతం వాటా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా అమెజాన్‌‌ సీఈఓ జెఫ్‌‌ బెజోస్‌‌ (నెట్‌‌వర్త్ విలువ 112 బిలియన్లు) కాగా, రెండోస్థానంలో మైక్రోసాఫ్ట్‌‌ కో–ఫౌండర్‌‌ బిల్‌‌గేట్స్‌‌ (106 బిలియన్లు) ఉన్నారు.

Related Posts