YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచేతన స్థితిలో ప్రభుత్వం

అచేతన స్థితిలో ప్రభుత్వం

అచేతన స్థితిలో ప్రభుత్వం
విజయవాడ, మార్చి 13
టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం  చేసిన తురకా కిషోర్ కు స్టేషల్ బెయిల్ ఎలా ఇస్తారు ? హత్యా యత్నం చేసిన కిషోర్ ను బయటకు వదిలారంటే ఏపీలో పోలీసు వ్యవస్థా ఉన్నట్టా లేనట్టా?  ఐజీ ప్రభాకర్ పవర్ ఫుల్లా, మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి పవర్ ఫుల్లా  అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. మాచర్ల సీఐ స్టేట్ రౌడీలా తయారయ్యారు. స్టేషన్ బెయిల్ తీసుకున్న తురకా కిషోర్ కాలర్ ఎగరేస్తూ బయట తిరుగుతున్నాడు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా మాచర్ల సీఐ అడ్డుకోవడం దారుణం. నామినేషన్లు వేస్తే గంజాయి విక్రయిస్తున్నట్టు కేసులు పెడతామని సీఐ భక్తవత్సల రెడ్డి టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆమె అరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రికి పట్టదా తురకా కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా ? తురకా కిషోర్ తరపున 13వ వార్డులో మహంకాళి అనే వ్యక్తి నామినేషన్ వేశాడు, నడిరోడ్డుపై హత్యాయత్నం చేసిన తురకా కిపోర్ ను వైసీపీ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటోదని అన్నారు. చిలకలూరిపేటలో వైసీపీ వర్గాలు  కొట్టుకుంటే అన్యాయంగా టీడీపీ వాళ్లను జైల్లో పెట్టారు. అమరావతి విషయంలో అన్యాయం చేయొద్దని ఎమ్మార్వోను వేడుకున్నవారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. రాజధానిలో డ్రోన్ వ్యవహారంలో పలువురిని అరెస్ట్ చేసి నేటికీ బెయిల్ ఇవ్వలేదు. మాచర్ల ఘటనలో మాత్రం తురకా కిషోర్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై డీజీపీ హైకోర్టు ఎదుట సంజాయిషీ ఇచ్చుకున్నారు. వైఎస్ వివేకాను హత్య చేసినట్టు తమనూ చంపేస్తారని పోలీసులు భయపడుతున్నారా ? రాష్ట్రమంతటా వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మైదకూరులో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ను హత్య చేసేందుకు కుట్ర చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అచేతన స్థితిలో ఉంది. కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీతో కుమ్మక్కైతే సామాన్యులకు రక్షణేదని అమె అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలను పాల్పడుతోంది. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తెలుగుదేశం లక్ష్యమని అమె అన్నారు.

Related Posts