YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తనిఖీ లు ముమ్మరం చేయండి.

తనిఖీ లు ముమ్మరం చేయండి.

తనిఖీ లు ముమ్మరం చేయండి.
* నగదు, మద్యం పంచితే చర్యలు తీసుకోండి
* ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు
* కమిషనర్ గిరీష
మార్చి 13
నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగర పొలిమేరల్లో గస్తీ పెంచి , తనిఖీ లు ముమ్మరం చేయూలని, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించి ఎక్సపెండించర్, సర్వేవ్ లెన్స్ కమిటీ తో సమావేశమయ్యారు. ఏ సందర్భంగా కమిషనర్ గిరీషా మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. నగర పొలిమేరల్లో గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని కి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. లక్ష రూపాయల పైన నగదు ఎవరు వద్ద ఉన్నా సీజ్ చేసి ట్రెజరీ కి తరలించాలని, సరైన పత్రాలు చూపిన తరువాత వారికి అప్పజెబుదామన్నారు. నామినేషన్స్ పూర్తి అయిన తరువాత అభ్యర్థుల ప్రచారాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. కరపత్రాలు ఎన్ని వేశారు, వాహనాలు ఎన్ని వినియోగిస్తున్నారు, పేపర్, టి.వి. యాడ్స్, పెయిడ్ ఆర్టికల్స్ పై దృష్టి సారించాలన్నారు. ఎన్నికల నియమావళి ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకు ఎటువంటి అనుమానం వచ్చినా ఆర్వో దృష్టి కి తీసుకెళ్లి, చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో 13మంది ఆర్వోలు అందుబాటులో ఉన్నారన్నారు.  ఓటర్లకు నగదు, మద్యం పంచి ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులకు కావాల్సిన ఎటువంటి అనుమతులనైనా త్వరితగతిన ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సింగల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేశామని అభ్యర్థులు వినియోగించుకోవాలన్నారు. ప్రతి రోజు ఈ హోర్డింగ్స్, బ్యానర్లు తొలగించారు, ఎంత నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారనే నివేదిక సాయంత్రం ఐదు గంటలలోపు ఇస్తే, మేము ఆరు గంటలలోపు ఎన్నికల కమిషన్ కు పంపుతాంన్నట్టు. ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను చక్కగా అమలు చేయా, ఎన్నికల నియమావళి బాధ్యత గా పాటించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, పోలీస్, ఎక్సపెండించర్, సర్వేవ్ లెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts