YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు మరో ఝలక్.. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ

చంద్రబాబుకు మరో ఝలక్.. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ

చంద్రబాబుకు మరో ఝలక్.. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
విజయవాడ, మార్చి 13
స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో కేఈ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానన్నారు.టీడీపీని వీడటం బాధగా ఉందన్నారు కేఈ.. కానీ తప్పడం లేదన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలనే టీడీపీలోనూ అవలంబిస్తున్నారని.. కోట్ల కుటుంబం టీడీపీలో చేరినప్పుడు రాజీనామా చేయాల్సి ఉందని..కానీ వేచి చూసే ధోరణితో ఆగామన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని.. వస్తే వెళ్తానని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.కేఈ ప్రభాకర్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు. ఆయన కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్‌లో పోటీ చేయడంతో.. ఆయన పత్తికొండ నుంచి పోటీచేసి గెలిచారు. 2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీచేసి ఓడిపోవడంతో.. 2019లో ప్రభాకర్‌ను డోన్ నుంచి పోటీచేసి చేయించగా ఓడిపోయారు. తర్వాత కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేయడంతో.. తర్వాత ఎమ్మెల్సీగా ప్రభాకర్‌కు అవకాశం కల్పించారు.

Related Posts