YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

చైనా అమెరికా మధ్య మాటల యుద్ధానికి తెరలేపిన కరోనా

చైనా అమెరికా మధ్య మాటల యుద్ధానికి తెరలేపిన కరోనా

చైనా అమెరికా మధ్య మాటల యుద్ధానికి తెరలేపిన కరోనా
న్యూ డిల్లీ, మార్చి 13 
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ చైనా అమెరికా నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలని తీసుకుంది. ఈ మహమ్మారి పుట్టుక గురించి ఇరు దేశాల నేతలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. చైనాలోని వుహాన్ లో తొలిసారిగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడినపుడు ఆ దేశం సరైన జాగ్రత్తలు తీసుకోనందు వల్లే సమస్య ఇంత కఠినంగా మారిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ మండిపడగా... కరోనాను వుహాన్ వైరస్ గా ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ అమెరికా నేతల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యాధికారులే ఈ ప్రాణాంతక వైరస్ను చైనాలోకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ బోర్డు డైరెక్టర్ వైరాలజిస్ట్ రాబర్ట్ ఆర్.రెడ్ ఫీల్డ్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో చేసిన ప్రసంగ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ఇన్ ఫ్లూయెంజా కారణంగా సంభవించిన కొన్ని మరణాలకు కరోనా కారణమని అమెరికా సీడీసీ డైరెక్టర్ చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా కారణంగా 34 మిలియన్ల మంది బాధపడుతున్నారని.. అదే విధంగా 20 వేల మంది మరణించారని పేర్కొన్నారు. అందు లో కరోనా వల్ల సంభవించిన మరణాలు ఎన్ని దయచేసి మాకు ఆ విషయం చెప్పండి. ఇంకో విషయం సీడీసీ చూడండి అక్కడే ఎలా దగ్గుతున్నారో.. అసలు అమెరికా లో ఎంతమంది వైరస్ బారిన పడిన పేషెంట్లు ఉన్నారు. వారికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల పేర్లేంటి బహుశా అమెరికా సైన్యమే ఈ ప్రాణాంతక వైరస్ను వుహాన్ కు తీసుకువచ్చి ఉంటారు. పారదర్శకంగా వ్యవహరించండి అలాగే కరోనా పై అమెరికా వివరణ ఇవ్వాల్సిందే అని లిజియాన్ డిమాండ్ చేశారు.కాగా ఆయన వ్యాఖ్యలను రాబర్ట్ ఒబ్రెయిన్ మరోసారి తిప్పికొట్టారు. కరోనా అమెరికా లో పుట్టలేదని.. కచ్చితంగా వుహాన్లోనే ఉద్భవించిందని చెప్పుకొచ్చారు.

Related Posts