YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

.కేంద్రం కరోనా వైరస్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది?

.కేంద్రం కరోనా వైరస్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది?

.కేంద్రం కరోనా వైరస్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది?
లోక్ సభలో ప్రశ్నించిన నెల్లూరు ఎంపీ ఆదాల
న్యూఢిల్లీ, మార్చి 13
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం లోక్ సభలో ప్రశ్నించారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్వనీకుమార్ చౌబే రాతపూర్వకంగా సమాధానమిస్తూ కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం మార్చి 11 నాటికి 1, 18, 322 కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయని 4292 మరణాలు నమోదయ్యాయని  పేర్కొన్నారు. ఇది 113 దేశాలకు పాకిందని పేర్కొన్నారు భారతదేశంలో మార్చి 12వ తేదీ నాటికి 73 కేసులు పాజిటివ్ కాగా, అందులో మూడు కేసులు డిశ్చార్జి అయ్యాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకరోనా ను ప్రపంచమంతా వ్యాపించిన అంటువ్యాధిగా ప్రకటించిందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుంటూ, సమగ్ర వివరాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. జనవరి 18 నుంచి దేశంలోని ముఖ్య నగరాలతో సహా 21 ఎయిర్ పోర్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా వైద్య బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏప్రిల్ 15 వరకు కొన్ని ముఖ్యమైనవి మినహా అన్ని వీసాలను రద్దు చేశామని, ఇది మార్చి 13 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. చైనా కొరియా ఫ్రాన్స్ జర్మనీ నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులపాటు క్వారంతాయిన్లలో  ఉంచుతున్నామని తెలిపారు. ఎయిర్పోర్టులో పనిచేసే సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ వ్యాధి నిరోధానికి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఉన్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమావేశాలు నిర్వహిస్తూ వైరస్ నివారణకు, నిరోధానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలకు గాను పూణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ తో పాటు మరో 14 సంస్థలకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. అక్కడ తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమన్వయం చేసుకుంటూ దేశంలోని కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులపై సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.

Related Posts