YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కృష్ణ కన్నయ్య: శ్రీ రంగం / తిరువారంగము:  రంగనాధాన్ (స్వయంవ్యక్త)  

కృష్ణ కన్నయ్య: శ్రీ రంగం / తిరువారంగము:  రంగనాధాన్ (స్వయంవ్యక్త)  

కృష్ణ కన్నయ్య:
శ్రీ రంగం / తిరువారంగము:  రంగనాధాన్ (స్వయంవ్యక్త)  
దివ్య దేశములలో ఇది మొట్ట మొదటి క్షేత్రము. వైష్ణవ వాడుక భాషలో కోయిల్  అంటే శ్రీరంగం అనే అర్ధం. కావేరి, కొల్లిడమ్ నధుల మధ్య అతి పెద్ద కోయిల్.  ఇక్కడ రంగనాధుడుని  నమ్ పెరుమాళ్ అని కూడా వర్ణిస్తారు. శయన  సేవ ఆది శేషు పై  తిరుముగం దక్షిణ దిక్కు.  శ్రీరంగనాధుడు మొదటి చతుర్ముఖుడు(బ్రహ్మ) ఆరాధన మూర్తి. అతి ప్రాచీన కాలమైన కృత యుగములో శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖుడు తాను నిత్యము ఆరాదించుకొనుటకు ఆరాధనా మూర్తిని అంటే విగ్రహమును ప్రసాదించమని శ్రీహరిని యాచించారు. ఆయన అయిదు తలల ఆదిశేషుపై శయనించిన శ్రీ రంగనాధుడి విగ్రహమును ప్రణవాకృతి విమానముతో బ్రహ్మకు బహుకరించేను. అది మొదలు బ్రహ్మ అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తూ ఉండేవారు.  శ్రీ రంగనాధుడు శ్రీ రంగనాయకి, ఉభయ కావేరులు, చంద్రపుష్కరిణి ప్రణవాకార విమానము. దక్షిణ తిరుక్కోలము, భుజంగ శయనము. ఆంతరంగిక కైంకర్యవరులు : తిరుప్పాణ్‌ఆళ్వార్.  పగల్ పత్తు, రాపత్తు ఉత్సవములు మిక్కిలి వైభవముగా జరుగును. ఈ క్షేత్రం లో రామ. కృష్ణ, నాచ్చియార్, చక్రతాళ్వార్, గరుడ, హనుమాన్ మరియు ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఈ క్షేత్రం దశావతార క్షేత్రం. దశావతార  సన్నిధులు ఇక్కడ ఉన్నాయి. బ్రహ్మకు  విష్ణుమూర్తి శేషుడుపై శయనిస్తు కనిపించి నేను స్వయంవ్యక్తని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పెను. ఇలా ఇంకా సప్త క్షేత్రముల్లో మనకి విష్ణుమూర్తి స్వయంవ్యక్త గా  దర్శనము ఇస్తారు అవి శ్రీముష్ణం, వెంకటాద్రి, శాలిగ్రామం, నైమిశారణ్యము, తోటాద్రి, పుష్కర్ మరియు బదరీనాథ్. వీటన్నిటి కంటే ముందర విమానము అవతరించేను. విరజా నది ఒడ్డున దీనిని బ్రహ్మ సూర్యునికి పూజా  పునస్కారముల కొరకు నియమించేను. ఆ తరువాత  అయోధ్యా రాజు ప్రార్ధించిన దీనిని ఇక్ష్వాకు వంశస్తులకు ఇచ్చెను. ఇక్ష్వాకు వంశస్తుడు ఆయిన రాముడు ఈ విమానాన్ని విభీషణుడుకి  రావణ సంహారం తరువాత బహుమతిగా ఇచ్చెను. ఈ పెరుమాళ్ ని పెరియ పెరుమాళ్ అని అనెదరు. విభీషణుడు ఈ విమానమును లంకకి తీసుకు వెళుతూ కావేరి నది ఒడ్డున “శేష పీఠం” అనే స్థలం లో చంద్రపుష్కరిణి దగ్గరలో మధ్యాహ్న్న ప్రార్ధనలకు ఉంచేను. తరువాత ఈ విమానాన్ని ఎత్తుటకు ప్రయత్నిస్తే అది కదల లేదు. అక్కడే స్థాపితమైపోయింది. విచారముతో విభీషణుడు విష్ణుమూర్తి ని ప్రార్ధించగా విష్ణుమూర్తి విభీషనుడితో నేను ఇక్కడే నా స్థలంగా నిశ్చయించాను మరియు నేను లంక వైపు చూస్తూ ఉంటాను మరియు లంక ఇక ముందు శ్రీ లంక గా వ్యవహరించబడును  కనుక నీవు ప్రతి దినము వచ్చి నన్ను పూజించుకో అని ఆనతిచ్చెను. ఇప్పటికీ విభీషణుడు ప్రతి రోజు శ్రీ రంగనాథుడికి పూజలు చేస్తారని నమ్మకము. ఇక్కడ పెరుమాళ్ తిరుముగం దక్షిణ దిక్కునకు లంక వైపుకు చూస్తూ వేంచేసియున్నారు. 
శ్రీ రామానుజాచార్యులు 120 సంవత్సరములు జీవించెను. ఆయన యొక్క తిరుమేను ఈ క్షేత్రములో భద్రపరచి ఉంచారు. కూర్చున్న సేవ. అరయర్ సేవ ఈ కోయిలలో నాలాయిర దివ్య ప్రభందం నృత్య రూపం లో  చేస్తారు. అరయర్ సేవ శ్రీవిల్లిపుత్తూరు, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురుంగుడి మరియు మేల్కోట్ లో చేస్తారు.
ఈ కోయిల్  156 ఎకరాల స్థలములో సప్త  ప్రాకరములతో నిర్మించ బడినది. సప్త  ప్రాకరము ఉల్లోపు 3 కి మీ. పొడవు వెడల్పు. ఏడు ప్రాకరాల  గోడల పొడవు 32,592 అడుగులు సుమారుగా 9 కి మీ. పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము. దక్షిణమున రాజగోపురం ఎత్తు 236 అడుగులు. దీనిని  44th  అహోభిల జీయర్ స్వామి నిర్మించారు. (1977) 
తిరుమంగై ఆళ్వార్ బయట ప్రాకారములను నిర్మించేను. నందన వనమును  తొండరడిప్పొడి ఆళ్వార్ నిర్మించెను. 
ఆళ్వార్లు స్తుతించిన 108 దివ్యదేశములలో అతి ప్రధానమయినది శ్రీరంగం కనుకనే మన పెద్దలు ప్రతి దినము “శ్రీమన్ శ్రీరంగశ్రియ మనుపద్రవాన్ అనుదినం సంవర్ధయా” అని శ్రీరంగం ఏ విధమయిన ఉపద్రవాలు లేక వర్ధిల్లాలని ప్రార్ధిస్తారు. ఎందుకంటే శ్రీరంగము అర్చ్యావతారములకు మూలకందము, పరమపదములో శ్రీమన్నారాయణుడు పరవాసుదేవుడుగా వేంచేసియున్నారు, క్షీరసాగరములో వ్యూహవాసుదేవునిగా ఆదిశేషునిపై శయనించి యున్నారు. ఈ వ్యూహవాసుదేవ మూర్తి నుండి విభవావతారాలయిన శ్రీరామ కృష్ణాదులు అవతరించారు. అంటే విభావావతారాలకు మూలము క్షీరాబ్దినాధుడు అన్నమాట. ఆలాగే అర్చ్యావతారాములకు మూలము శ్రీరంగనాధుడు.  అర్చ్యావతారము అంటే విగ్రహము కాదు. ఎవరు ఏ ఆలయములో గాని గృహములో గాని ఏ విష్ణు విగ్రహమును ప్రతిష్టించిన అందులో ఆ భగవత్ శక్తి శ్రీరంగనాధుడినుంచే వస్తుంది గనుక శ్రీరంగం నిరుపద్రవముగా ఉంటే అర్చ్యారూపములో ఉండే ఏ ఆలయము ప్రమాదములకు గురి కాకుండా ఉంటాయి అందుకే శ్రీరంగం వర్ధిల్లాలని కోరుకొంటాము. తిరుమంగై ఆళ్వార్లు “ఆరామమ్ శోలందారంగానగర్వాడ”  అని అంటారు  అంటే చుట్టూ తోటలతో ఉండే శ్రీరంగము సుఖముగా వర్ధిల్లాలని అని అంటే ఇక్కడ తోటలు అంటే దేశములో ఉండే ఆలయాలని అర్ధము. అన్ని ఆలయములకు మూలమయినది ఈ శ్రీరంగము. తిరుప్పాన్ ఆళ్వార్ ఇక్కడే పరమపదించెను భోగ మండపము, త్యాగ మండపము, పుష్ప మండపము, జ్ఞానమ

ండపములుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రములలో శ్రీరంగము భోగమండపము. 2. తిరుమల: పుష్ప మండపము. 3. కాంచీపురము: త్యాగమండపము. (వరదరాజ పెరుమాళ్) 4. తిరునారాయణ పురము(మేల్కొట్): జ్ఞానమండపము. 
ఈ కోవిలలో నాలుగు కాళ్ళ మండపం ఎదురుగా అలఘియ సింగర్ (నృసింహ స్వామి) సన్నిధి ఉన్నది.  ఇక్కడే కంబరుడు కంబ రామాయణము విశదీకరించెను. 
మూలవర్: శ్రీ రంగనాధుడు, భుజంగ శయనము. తిరుక్కోలము: కిడాంత తిరుక్కోలము(శయన సేవ). తిరుముగము: దక్షిణము. 
ఉత్సవార్: నంపెరుమాళ్
ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి “పెరియపెరుమాళ్” అని పేరు. ఉత్సవమూర్తి కి “నంబెరుమాళ్” అని పేరు, ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీ రంగనాధుల ఉత్సవమూర్తిని చంద్ర గిరి ప్రాంతమునకు వేంచేపు చేసికొనిపోయినారు. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తి గా వేంచేపు చేసిరి. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని “తిరువరంగ మాళిగైయార్” అని అందురు. 
ప్రత్యక్షం; ధర్మవర్మకు, రవివర్మకు, విభీషణునకు, 
తాయారు : రంగనాయకి, ఉభయ కావేరులు. ప్రత్యేక సన్నిధి. 
విమానం : ప్రణవాక్ర్రితి విమానం 
తీర్థం : చంద్ర పుష్కరిణి 
ఆళ్వార్ మంగళాశాసనము: పెరియాళ్వార్: 181. 189. 212. 245. 402-432 (25) పాశురములు. పెరియాళ్వార్ తిరుమొழி: 4-8-1.
ఆండాళ్ : 607-616 (10) 
కులశేఖర ఆళ్వార్: 647-676, 728. (21)పెరుమాళ్ తిరుమొழி: 1-1-1. తిరుమழிశై ఆళ్వార్: 772. 800-806, 844. 870. 2384. 2411. 2417. 2441. తిరుచ్ఛంద విరుత్తమ్: 49.  తొందరడిపోడి ఆళ్వార్: 872-926,తిరుమాలై: 2. తిరుప్పాణి ఆళ్వార్: 927-936.అమలనాదిపిరాన్: 1. తిరుమంగై ఆళ్వార్: 1019. 1213. 1378-1427. 1506. 1571. 1664. 1829. 1978. 2029. 2038. 2043. 2044. 2050. 2062. 2063. 2065. 2069. 2070. 2703-2076. 2673. 2673. 2674. పె.తి.మొ: 5-8-9. పోయిగై ఆళ్వార్: ముదల్ తిరువందాడి -6. పూదత్ఆళ్వార్: 2209, 2227, 2251, 2269.ఇరండాంతిరువందాది: 28. పేయాళ్వార్: 2342-2343. మూన్ఱాం తిరువందాది: 62.  నమ్మాళ్వార్: 2505, 3348-3358. 3512 తిరువాయి మొழி:7-2-1.ఆండాళ్: తిరుమొழி: 11-3. నాలాయిర దివ్య ప్రభందం  పాశురముల  పట్టిక ప్రకారము. మధురకవి ఆళ్వార్ తప్ప మిగతా ఆళ్వార్లందరు స్తుతించిన క్షేత్రము. శ్రీరంగం సప్త ప్రాకరాలతో వెలసిల్లే దివ్యక్షేత్రము. ఈ ఏడు ప్రాకరాలు ఏడు ఊర్ధ్వలోకాలకు సంకేతము. 
గర్భాలయములో శ్రీ రంగనాధుని యెదుట గల బంగారు స్తంభములకు “తిరుమాణై త్తూణ్” అని పేరు. నంబెరుమాళ్ సౌందర్య సముద్రములో పడి కొట్టుకొను పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొందురు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశమును “గాయత్రి మండపము” అని పేరు. గర్భాలయమునకు ముందు గల ప్రదేశము “చందన మంటపము”, గర్భాలయ ప్రదక్షణకు “తిరువణ్ణాళి” ప్రదక్షణమని పేరు. 
మొదటి ప్రాకారమున గల ముఖ్య విశేషములు: గర్భాలయము కలది మొదటి ప్రాకారము. దీనినే ధర్మవర్మ ప్రాకారము అని అంటారు. ఇది 240 అడుగుల పొడవు 180 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది సత్యలోకానికి సంకేతము. ద్వారపాలకులు, యాగ శాల, విరజాబావి, సేనమోదలియార్ సన్నిధి, పగల్పత్తు మండపము, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఇక్కడ కలవు. ఇక్కడ గల చిలకల మండపం నుండియే ప్రణవాకృతి విమానము పై గల పరవాసుదేవులను సేవింపవలయును. 
రెండవ ప్రాకారము:  ఈ గోపుర ద్వారమునకు “ఆర్యభట్టాళ్ వాశల్” అని పేరు. ఈ ప్రాకారములో పవిత్రోత్సవ మండపం కలదు. ఈ మండపం లో హయగ్రీవులకు, సరస్వతి దేవికి సన్నిధులు కలవు. రెండవది ఉళ్ కోడై మండపం. దీనికి దొరమండపము అనియు పేరు కలదు. విరజా మండపము. దీని క్రింద విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం జరుగు మండపం. పరమపద వాశల్; తిరుమడపళ్లి; ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం కలవు. ఇచ్చట స్తంభముపై గల వినీత ఆంజనేయస్వామి వరప్రసాది. 
మూడవ ప్రాకారం: ఈ ప్రాకారమునకు “అలినాడన్ తిరువీధి” అని పేరు. ఈ తిరువీధిలో గరుడన్ సన్నిధి గలదు. దీనికి వెలుపల వాలి సుగ్రీవుల సన్నిధులు గలవు. నమ్మాళ్వార్ సన్నిధి ఈ ప్రాకారములోనే కలదు. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలుచు మండపం కలదు. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి కలదు. ఊగ్రాణము; మేల్ పట్టాభి రామన్ సన్నిధి; ముదలాళ్ళ్వార్ల సన్నిధి; చంద్రపుష్కరణి; పొన్న వృక్షము, వీని వెనుక వేద వ్యాసర్, వరాహ పెరుమాళ్ కోవిల, వరదరాజస్వామి  సన్నిధి, కీళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాధన్ సన్నిధి, తిరుమణల్  వెళి (ఇసుక బయలు) తీరుమழி శై ఆళ్వార్ సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరణి, తిరుక్కచ్చినంబి సన్నిధి గలవు. 
నాల్గవ ప్రాకారం: ఈ ప్రాకరమునకు “అకాళంకనాట్టాళ్వాణ్” తిరుచ్చి అని పేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి కలదు. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీ పాదములందు నంజీయర్ వేంచేసియున్నారు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన  గరుడాళ్వార్ సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట శ్రీమన్నాధ మునుల సన్నిధి కలదు. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము కలదు.  ఈ ప్రాకారములో సేవింపదగినది శ్రీరంగ విలాస మండపం. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీ కృష్ణ, శ్రీ వరాహ, శ్రీ రామ) అవతరించిన విధము చిత్రించబడినది. విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్  సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపము, ఈ ప్రాకరములోనే కలవు. శ్రీ రంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే  యున్నది. ఈ సన్నిధి ముఖమండపస్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షులు వేంచేసియున్నారు. మీనమాస పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్ తో శ్రీరంగనాధులు వెంచేసియున్న సమయమున ఉడయవరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము ఈ ప్రాకరములోనే కలదు. మెట్టళఘియసింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఇందుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు మూడు ద్వారములు), శ్రీనివాసపెరుమాళ్, పెరియావాచ్చాంబిళ్లై సన్నిధి, ఈ ప్రాకారములోనే కలవు. ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధుల కొలువు తీరు వేయి కాళ్ళ మండపము ఈ ప్రాకారమునకు సమీపములోనే ఉన్నది. దీనికి “ఆయిరమ్ కాల్ మండపమని” పేరు. (సహస్రస్థూణా మండపము) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.  ఇచ్చట గల శేషరాయన్  మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక్క దరి కోదండరామన్ సన్నిధి కలవు. దాని ప్రక్కన పిళ్లై లోకాచార్యుల వారి సన్నిధి, వారి సోదరులు అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్ధ సారధి సన్నిధి కలవు. ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (భగవద్రామనుజులు) సన్నిధి. ఇచట ఉడయవర్ “తానాన” తిరుమేనిగా వేంచేసి ఉన్నారు. ఇది పూర్వము వసంత మండపము. ఇచ్చట ఉడయవర్ ని సేవించిన ఉడయవర్ వారి హృదయమున వేంచేసి యుండురని మణవాళ మామునులు అభివర్ణించియున్నరు. ఈ సన్నిధి లో ఆళవందార్  పెరియనంబి వేంచేసి ఉన్నారు. ప్రతి దినము ఉదయము 9:00 గం”లకు స్వామి సన్నిధిలో శాత్తుముఱై జరుగును. ఈ ప్రాకరములో వీరాంజనేయస్వామి సన్నిధి, విఠ్ఠల కృష్ణన్ సన్నిధి, తొందరడిప్పొడియాళ్వార్ సన్నిధి కలవు.
ఐదవ ప్రాకారము: ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి అని పేరు. మకర (తై) మీనా (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు.  మకరమాస పుష్యమీ నక్షత్రముల నంబెరుమాళ్ళ్ ఉభయనాచ్చియార్లతో తిరుత్తేరుపై వేంచేయుదురు. ఈ ప్రాకారములో  ఉత్తరనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్య పురుషుల తిరుమాళిగలు, మనవాళమామునుల సన్నిధి కలవు.  
ఆరవ ప్రాకారము: ఈ ప్రాకారమునకు చిత్రి వీధి అని పేరు. మేషమాస (చిత్రి) బ్రహ్మోత్సవమున  నంబెరుమాళ్ళు  ఈ వీధులలో వేంచేయుటచే ఈ వీధికి “చిత్ర వీధి” యని పేరు. ఆళ్వారాధులు తిరునక్షత్రములయందు ఈ తిరువీధులలో వేంచేయుదురు. 
ఉత్తర మాడ వీధిలో “వేదాంత దేశికర్ సన్నిధి, దీని దరిలో జగన్నాధన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడలో తిరుత్తేరు, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్  తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం కలవు.  దక్షిణ ప్రాకార వీధి మధ్యలో పాతాళ కృష్ణన్ సన్నిధి కలవు. ఇది అయిదు అడుగుల లోతులో ఉన్నది. 
ఏడవ ప్రాకారము:  ఈ ప్రాకారమునకు “అడయవళంజన్” వీధి అని పేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి కలదు. వెళియాండాళ్ సన్నిధి కూడా కలదు. పడమటి ద్వారం గుండా తెప్ప గుంటకు పోవచ్చును. కుంభమాస (మాసి) బ్రహ్మోత్సవములో రధోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంట లోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి కలదు. ఈ కొల్లడము దక్షిణ తీరమున తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యేకమైన దశావతారాముల సన్నిధి కలదు. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడమందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై కలవు. పడమటి ద్వార సమీపములో కాట్టళిఘియా సింగర్ సన్నిధి కలదు.  ఇది శ్రీ వచన భూషణమవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరీ నదికి పోవచ్చును. దీనికే రాజ గోపురమని పేరు. 
నమ్మాళ్వార్ల తిరువాయిమొழி సప్తమ శతకము రెండవ దశకములో (7-2) భగవద్విశ్లేషమును సహింపలేక శ్రీ రంగనాధుల శ్రీ పాదములలో ప్రపత్తి చేసి అదియు ఫలింపక పోవుటచే దుఃఖనిమగ్నులై నాయికావస్థను బొంది యుండగా అప్పుడామె తల్లిగారు తమ కుమార్తె విషయమై “నీవేమి తలచియున్నావని: శ్రీ రంగనాదుని ప్రశ్నించుచున్నారు. “ఇవళ్ తిర్త్తు ఎన్ శిందిత్తాయ్” ఈమె విషయమై ఏమి తలంచితివి?
“అమయకురాలగు ఈ శఠగోపనాయికను పరితపింప చేయుచు నేమియు తెలియని వానివలె కావేరీ జలపరిపూర్ణమైన శ్రీ రంగమున నాగపర్యంకముపై పవళించి యుంటివా! ఈమె నేమి చేయ దలచితివి? యని శ్రీ రంగనాథుని సౌహార్దమను” గుణమును ప్రకాశింప చేయుచున్నారు. 
పెరియాళ్వార్ ఈ దివ్యదేశమును “తిరువళన్ తిరుప్పది” యని అభివర్ణించి యున్నారు. 
తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని “కుడపాలానై” పశ్చిమ దిగ్గజమని వర్ణించియున్నారు. తెన్నానై :- సుందరన్ బాహువు పెరుమాళ్ (తిరుమాలిరుంశోలై) దక్షిణ దిగ్గజమని వడవానై  - తిరువేన్గడముదై యాన్ – ఉత్తర దిశా దిగ్గజము
కుణపాలమదయానై – శౌరిరాజ పెరుమాళ్ – ప్రాక్‌దిశాదిగ్గజము (తిరుక్కణ్ణా పురము) నమ్మాళ్వార్ తమ తిరువాయిమొழி ప్రబంధమును శ్రీ రంగనాధులకు అంకితము జేసిరి. నమ్మాళ్వార్ “ముగిల్వణ్ణనడిమేల్ శొన్నశొల్‌మాలై అయిరత్తి పత్తుమ్” మొయిన్లు వంటి కాంతిగల శ్రీ రంగనాధుల శ్రీ పాదముల విషయమై సర్వేశ్వరుడు అర్చావతారమున తన నిత్య కృత్యములను ఈ విధముగా నిర్వహించునని పెద్దలు సాదింతురు. 
నిద్ర మేల్కొనుట - థిరునారాయణపురమున 
సుప్రభాతసేవ - తిరుమలై
స్నానము - ప్రయాగ
జపము - బదరికాశ్రమము
ఆరగింపు - పూరీ జగన్నాధము
రాచకార్యము - అయోధ్య
విహారము - బృన్దావనము
శయనము - శ్రీ రంగము
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts