YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం- కోదండరామ్‌

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం- కోదండరామ్‌

.ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం- కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 14
ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని తెలంగాణ జన సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ అన్నారు. అన్నివర్గాల ప్రజల హక్కుల కోసం ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ పథకాలనూ ప్రజలకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తూ ఆయా పార్టీల కోసం, నేతల కోసం, హక్కుల కోసం వార్తలు రాసి చేయూతనిస్తున్న జర్నలిస్టులు ఎన్నోసమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. భారతీయ తెలుగు వెలుగుల సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్న సీనియర్‌ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్‌కు కోదండరామ్‌ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రెస్‌ కౌన్సిల్‌ రాష్ట్రశాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోదండరామ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు నిరుపేదలకు నిర్మించి ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సమస్యలతోపాటు మద్యపాన నిషేధం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్నిపార్టీలతో కలిసి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయిలో పోరాటం చేస్తామని కోదండరామ్‌ ప్రకటించారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలపై దోమలు దాడి చేస్తున్నా సీఎం కేసీఆర్‌ దోమలను నివారించలేకపోతున్నారని అన్నారు. 

Related Posts