దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. మరోవైపు నేటి నుంచి ఆగస్టు నెల డెరివేటివ్ సిరీస్ కూడా ప్రారంభమైంది. దీంతో మార్కెట్లు కూడా సానుకూల బాటలోనే నడుస్తున్నాయి.వరుస సెలవుల అనంతరం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు నమోదవుతాయని రిపోర్టు అంచనాలు వేయడంతో దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 287పాయింట్ల లాభంతో 33, 255వద్ద నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 10211 వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో నిఫ్టీ 10200 స్థాయిని నిలబెట్టుకుని శుభారంభాన్నిచ్చింది.