YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

.మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్ నిష్క్రమణ

.మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్ నిష్క్రమణ

.మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్ నిష్క్రమణ
న్యూ డిల్లీ, మార్చి 14,
ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ను స్థాపించిన బిల్ గేట్స్ ఆ సంస్థ నుంచి శాశ్వతంగా వైదొలిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ప్రకటించారు. అలాగే బెర్క్ షైర్ హాత్వే బోర్డులో తన స్థానం నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ తో బిల్ గేట్స్ కున్న 35 ఏళ్ల అనుబంధం నిన్నతిటో తెగిపోయింది.బిల్ గేట్స్ ఇప్పుడు సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. భార్య మెలిండాతో కలిసి ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. 2014వరకు బోర్డు చైర్మన్ గా ఉన్న బిల్ గేట్స్ ఇప్పుడు పూర్తిగా వైదొలిగారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మాట్లాడుతూ బిల్ గేట్స్ తో పనిచేయడం.. ఆయన ద్వారా చాలా నేర్చుకున్నానని.. ఇదొక గొప్ప గౌరవం అని చెప్పారు.2000 వరకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా బిల్ గేట్స్ పనిచేశారు. ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ స్థాపించి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఈ క్రమంలోనే స్టీవ్ బాల్మెర్ కు ఆ తర్వాత సత్యనాదెళ్లను సీఈవోగా చేశారు. 1955 అక్టోబర్ 28న బిల్ గేట్స్ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో గల సియాటెల్ లో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు.1985లో మైక్రోసాఫ్ట్ స్థాపించారు.

Related Posts