YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణాలో వడగండ్ల వానలు 

Highlights

  • బేజారవుతున్న రైతన్నలు 
  • అప్రమత్తమైన సర్కార్ 
  • వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి
  • నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  కేసీఆర్ ఆదేశాలు 
తెలంగాణాలో వడగండ్ల వానలు 

తెలంగాణ రాష్ట్రంలోని  హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో అకాల భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తుంది.  హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, యూసఫ్ గూడ ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం కురుస్తోంది. దీనితో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

అదే విధంగా  వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు.

అంతేకాకుండా  రాబోయే రోజుల్లో పడే వర్షాల వల్ల కలిగే నష్టాన్ని వెంట వెంటనే అంచనా వేయాలన్నారు. నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడానికి సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు.ముఖ్యమంత్రి మేరకు ఎస్‌కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు చేట్టాలని చెప్పారు.

Related Posts