YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సైబర్ నేరగాళ్ళతో జర భద్రం

సైబర్ నేరగాళ్ళతో జర భద్రం

సైబర్ నేరగాళ్ళతో జర భద్రం
వరంగల్  పోలీస్ కమిషనర్  డా.వి.రవీందర్ .
వరంగల్, మార్చి 14
సైబర్‌ నేరగాళ్ళతో వ్రజలు అవ్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్‌ పోలీన్‌ కమిషనర్‌ ప్రజలకు పిలువునిచ్చారు. సైబర్‌ నేరాల నియంత్రణలో భాగంగా సైబర్‌ నేరాలపై వ్రజలను అవ్రమత్తత చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం వత్రికా వ్రకటన విడుదల చేసారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు ప్రజలు తమ కనీస అవసరాలను అవసరమయిన వస్తు వికయాలతో పాటు, డబ్బు లావాదేవీలను సైతం ప్రజలు ప్రస్తుతం అందుబాటులో వున్న అధునిక పరిజ్ఞానంతో కూడిన ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోని ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులు తాము వున్న ప్రాంతం నుండే వ్యవహరాలను చక్యపెట్టడం జరుగుతోంది. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్ళు సైతం అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని ప్రజల అవసరాలను అసరాగా చేసుకోని సైబర్‌ నేరాలకు పాల్పడటం జరుగుతోంది. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్ళు ప్రజల అవసరాలు లేదా బలహీనతలను దృష్టిలో వుంచుకోని సైబర్‌ నేరగాళ్ళు వివిధ మార్గాల్లో ప్రజలను  మోసం చేస్తూ నేరాలకు డతున్నారు. ఇందులో ముఖ్యంగా లాటరీ, బహుమతులు వచ్చాయని, ఉద్యోగాలు, రుణాలు, సెల్‌ టవర్లు ఇప్పిస్తామని సెల్‌ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాన్ని నమ్మి సైబర్‌ నేరగాళ్ళ ఉచ్చుకు చిక్కిమోసపోతున్నారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో అధికంగా ఆర్మీ విధులు నిర్వహిస్తున్న ఆర్మీ అధికారుల పేరుతో ఓలెక్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ద్వీచక్ర మరియు కారులాంటి వాహనాలను తక్కువ ధరలకు అమ్మకం  చేస్తునట్లుగా వచ్చే ప్రకటలకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులై సైబర్‌ నేరగాళ్ళ ఉచ్చు చిక్కి ఎక్కువ మొత్తంలో డబ్బును కోల్పోతున్నారు. ఇలాంటి ప్రకటల పట్ట యువత అప్రమత్తంగా వ్యవహరిమచాల్సి వుంటుందని. అదే విధంగా అపరిచిత వ్యక్తుల నుండి తమ ఫోన్లకు వచ్చే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం, లింక్‌లపై క్లిక్‌ చేయడం లాంటి వాటికి ప్రజలు దూరంగా వుండాల్సి వుంటుందని. సెల్‌ఫోన్ల ద్వారా బ్యాంక్‌కు సంబంధించి అధికంగా లావాదేవీలు నిర్వహించే వినియోగదారులను మోసం చేసేందుకుగాను కె.వై.సి అప్‌డేట్‌ సాకుతో సైబర్‌ నేరగాళ్ళు అడిగే ఆధార్‌, పాన్‌ కార్డుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేయడం ద్వారా తమ ఖాతాల్లోని డబ్బును కోల్పోపోవడం జరుగుతుందని. బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించి తమ ఫోన్లకు వచ్చే ఒన్‌ టైం పాస్‌ వర్డ్‌ను ఇతరులుకు తెలియజేయకపోవడం ద్వారా ప్రజలు తమ డబ్బును నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాలను వినియోగించే యువతులు, విధ్యార్థునులు సైతం సైబర్‌ నేరగాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు. ఇది దృష్టిలో వుంచుకోని మహిళలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇస్టాగ్రాం లాంటి సామాజిక మాద్యామాల ద్వారా అపరిచిత వ్యక్తులకు తమ వ్యక్తిగత సమాచారంతో పాటు ఫోటోలు పోస్ట్‌ చేయడం చాలా ప్రమాదకమని పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలు నియంత్రించడం కోసం ప్రత్యేకంగా సైబర్‌ విభాగాన్ని ఎర్పాటు చేయడం జరిగింది. సైబర్‌ విభాగం ఏర్పాటు జరిగిన నాటినుండి వరంగల్‌ పోలీస్‌ కమిషనరెట్‌ పరిధిలో ఇప్పటి వరకు 156 సైబర్‌ నేరాలను పరిష్మరింబడ్దాయని ఇందులో సామాజిక మాధ్యామాల మోసాలకు సంబంధించి 89, డెబిట్‌ మరియు క్రెడిట్‌ కార్డు మోసాలు 34, ఓ.టి.పి/ె.వై.సి మోసాలు 12, మొబైల్‌ వ్యాలేట్‌ మోసాలు 09, ఉద్యోగాలు, బహుమతులు మోసాలు 08, మొయిల్‌ ద్వారా మోసాలు 04కేసులు వున్నాయని. ఈ మొత్తం కేసుల్లోని 129 మంది సైబర్‌ నేరగాళ్ళను సైబర్‌ విభాగం పోలీసులు అరెస్ట చేసి భాధితులకు న్యాయం చేకూర్చడం జరిగిందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Related Posts