YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు

శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు

శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు
అనంతపురం, మార్చి 14
రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగటం లేదు. ప్రతిపక్షాలు అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ విమర్శించారు.  వైసీపీ ప్రభుత్వం లోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.  శనివారం ఉదయం పెనుకొండ మండలంలోని, మునిమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రమంతా శాంతి భద్రతలు బాగున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఫ్యాక్షన్ హత్యలు గాని, రాజకీయ హత్యలు గాని జరగలేదని, ఫ్యాక్షన్ గొడవలను నివారించడంలో మా ప్రభుత్వం సఫలీకృతం అయిందని పేర్కొన్నారు.  ఏ విధంగా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా, అవాంఛనీయ, అరాచక కార్యకలాపాలను నివారించడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్త శుద్ధితో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎక్కడైనా అవాంఛనీయ కార్యకలాపాలు జరిగితే వాటిని అణగదొక్కే విధంగా పోలీసు వ్యవస్థకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.  గత ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతి పనులు, దౌర్జన్యాలు చేయడానికి ప్రోత్సాహం అందించి అధికారుల, పైన ప్రజల పైన దాడులు చేసిన వైనం గత అయిదేళ్లుగా మనం చూశామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అటువంటి వాటికి అలాంటి తావివ్వకుండా సుపరిపాలన, పారదర్శక మైనటువంటి పాలన  అందించడానికి మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారని మంత్రి తెలిపారు.   ఇంతటి స్వచ్ఛమైన పాలన అందిస్తున్న ఇటువంటి తరుణంలో చంద్రబాబు అండ్ కో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం లాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి  వ్యక్తిత్వంపై విమర్శలు  చేస్తున్న చంద్రబాబు నాయుడు తన హయాంలో అధికారులపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై చేసిన దౌర్జన్యాల పట్ల ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లాలో, ఎల్లనూరు, తాడిపత్రి, ధర్మవరం,  రాప్తాడు ప్రాంతాల్లో మీరు చేసిన అరాచకాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని, రానున్న స్థానిక ఎన్నికల బరిలో టిడిపి అభ్యర్థులు ఎన్నికల శాంతియుతంగా నిర్వహించడానికి సహకరించాలని ఎటువంటి కవ్వింపు, రెచ్చగొట్టే  చర్యలు చేయకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేట్లు చూడాలని సూచించారు.   రానున్న  స్థానిక, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అయన కోరారు.

Related Posts