YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీలో కరోన లేదు 

 ఏపీలో కరోన లేదు 

 ఏపీలో కరోన లేదు 
విజయవాడ, మార్చి  14తులు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో కరోనా నిరోధక చర్యలపై ప్రత్యేక బులెటెన్‌ విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదైందని, అయితే 14 రోజుల తర్వాత మళ్లీ నమూనాలు పరీక్షించి బాధితుడిని డిశ్చార్జ్‌ చేస్తామని జవహర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌- 19 విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు, వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచినట్లు జవహర్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 0866-2410978ను సంప్రదించవచ్చని సూచించారు. కోవిడ్‌- 19 లక్షణాలు ఉంటే, సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. వైద్య సలహాల కోసం 104 టోల్‌ ఫ్రీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.కోవిడ్‌- 19 ప్రభావిత దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 675 మంది వచ్చారని, వారంతా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జవహర్‌రెడ్డి వెల్లడించారు. 428 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందని, ఆస్పత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 61మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా, 52 మందికి నెగిటివ్‌ అని తేలిందని, 8 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టినట్లు జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మొత్తం 8,691 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేసినట్లు వివరించారు. వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ/ గన్నవరం ఓడరేవుల్లో 1,088 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్‌ చేశామని, వీరిలో ఏ ఒక్కరికీ వ్యాధి లక్షణాలు లేవన్నారు. కృష్ణపట్నం ఓడరేవులో 622 మంది ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేశామని, వీరిలోనూ వ్యాధి లక్షణాలు లేవని తేల్చి చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.

Related Posts