కరోనాపై కేంద్రం చర్యలు భేష్
హైద్రాబాద్, మార్చి 14
కేంద్రం విషయంలో కేసీఆర్ ఎప్పుడూ సీరియస్‌గా ఉండరని ఓ సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్ని కూడా పెద్దగా ఫాలో అవ్వరు. ఎన్ఆర్సీని పార్లమెంట్‌లో తమ పార్టీ తరపున వ్యతిరేకించారు. బీజేపీ పెద్దలు రాష్ట్రానికి ఎవరొచ్చిన కూడా గులాబీబాస్ పెద్దగా పట్టించుకోరని కూడా చాలామంది చెబుతుంటారు. కేంద్రానికి, కేసీఆర్‌తో సత్సంబంధాలు లేవని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా కేంద్రానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో... సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కిలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ పై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. కేసీఆర్ ప్రకటన తర్వాత.... ప్రతిపక్షాలు మాట్లాడాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కరోనా నివారణకు కేంద్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో ఎవరికీ కరోనా వైరస్ రాకూడదన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అయితే భట్టీ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రం సరైన చర్యలు చేపట్టడం లేదని మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యతలో ఉన్నవారు ఏవరైనా సరే ఇలాంటి విషయాల్లో బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు. ప్రతీదాన్ని రాజకీయం చేస్తే ఎలా ? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు.కరోనా నివారణకు కేంద్రం కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. సమాజాన్ని భయబ్రాంతులకు గురి చేయోద్దు అన్నారు . పబ్లిక్‌ను అనవసరంగా ఆగమాగం చేయోద్దని ప్రతిపక్షాలకు సూచించారు. చిల్లర టీవీలు ఏవేవో ప్రచారం చేస్తాయన్నారు. కేంద్రం ఏ పని చేయడం లేదని అనడం దుర్మార్గమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వైరస్ నివారణ ఒక్కసారిగా జరిగిపోతుందా ? అని ప్రశ్నించారు. 11 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల తనకే అందుబాటులోకి రాలేదన్నారు. నిత్యం ఏదో ఓ సమీక్షలు నిర్వహిస్తూ...పర్యటిస్తూ బిజీ బిజీగా ఉన్నారన్నారు. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నారన్నారు. పార్టీల పరంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్‌లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. ఆ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తామా ? అని భట్టి చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు కేసీఆర్. మీ పార్టీ పేరు కంపు చేసుకోవద్దు అంటూ చురకలంటించారు. అయినా మీలాంటి వాళ్లు మాట్లాడితే మేం పట్టించుకోమన్నారు కేసీఆర్. చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.మనదేశంలో క్యాజువాలిటీ లేదన్నారు. వైరస్ బారిన పడి అనేకమంది దేశంలో వేలాదిమంది చనిపోతున్నారన్నారు. అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు. ఆ విషయానికి వస్తే మన భారతదేశం చాలా అదృష్టవంతమైన దేశం అన్నారు. అధికారుల్ని ఆదేశాల్ని పాటించాలన్నారు. ప్రతీఒకరు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు కేసీఆర్. శవాలమీద పేలాలు ఏరుకోకండి లంగాణలో కరోనా వైరస్ స్థితిగతులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. కరోనాకు పారాసిట్‌మాల్ ట్యాబ్‌లెట్ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్ అన్నారని భట్టి ఎద్దేవా చేశారు. అంతేకాక, 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా దరి చేరదని, అంత ఎండలో ఆ వైరస్ చనిపోతుందని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు కర్ణాటక వాసి హుస్సేన్ సిద్ధిఖీ హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత కూడా ఎలా చనిపోయాడని భట్టి ప్రశ్నించారు.భట్టి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ముఖ్యమంత్రి.. నోరుంది కదా అని ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ప్రవర్తించవద్దని హితవుపలికారు. ప్రజలకు ధైర్యం చెప్పాలని.. గందరగోళానికి గురిచేయడం సరికాదని అన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తగిన ఉష్ణోగ్రత దగ్గర వైరస్ బతకదని చెప్పానని.. పారాసిట్‌మాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని ఒక సైంటిస్ట్ తనతో చెప్పారని గుర్తు చేశారు. పాతబస్తీని ఎందుకు బద్నాం చేస్తున్నారని.. చిల్లర టీవీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు.. అవి నమ్ముతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.చివరికి కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజలు కంగారు పడతారని ఆ విషయాన్ని వాళ్లు నాలుగైదు రోజుల తర్వాత నెమ్మదిగా ప్రకటించారని చెప్పారు. కరోనాపైన కూడా ఇటువంటి రాజకీయాలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉందని, కరోనా వ్యాప్తి జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోందని కొనియాడారు. అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగానే పనిచేస్తున్నాయని చెప్పారు. దేశానికి పట్టిన పెద్ద కరోనా వైరస్ కాంగ్రెస్సేనని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.