కరోనా వైరస్ సోకినరోగులకు ట్రీట్‌మెంట్ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
భారత దేశం కరోనా వైరస్‌ను కట్టడికి కేంద్రం తాజాగా తీసుకున్న చర్యల వల్ల శనివారం దేశంలో కొత్తగా 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ ఇద్దరి కుటుంబాలకూ కేంద్రం రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. ఇకపై కరోనా వైరస్ వల్ల రోగులకు ఎలాంటి ట్రీట్‌మెంట్ చేసినా ఆ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు... ఏడుగురికి కరోనా పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లను శనివారం ఆస్పత్రుల నుంచీ డిశ్చార్జి చేశారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్ నుంచి ఐదుగురు, రాజస్థాన్ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 84గా ఉన్నాయి. ఐతే... ఈ 84 మందితో దగ్గరగా ఉన్న మరో 4000 మందిని కేంద్రం ప్రత్యేకంగా ఉంచి వైద్య పరీక్షలు జరిపిస్తోంది. ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకి... ఇద్దరు చనిపోవడంతో..