YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బాబుకు కరోనా కలిసొచ్చింది

 బాబుకు కరోనా కలిసొచ్చింది

 బాబుకు కరోనా కలిసొచ్చింది
విజయవాడ, మార్చి 16
చంద్రబాబు నక్కను తొక్కిన నాయకుడు. ఆయన జాతకమే అంత. అందుకే ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరు. రెండు సార్లు దేశానికి ప్రధానిగా బంపర్ మెజారిటీ సాధించి అజేయుడైన మోడీ కూడా బాబు గురించి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇక తెలంగాణాలో ఉద్యమనేత‌, ఆపై తొలి పాలనా భాగ్యవిధాత అయిన కేసీఆర్ అయితే చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అంటూ తానే కాపాడేస్తూంటారు. చంద్రబాబుతో దశాబ్దాల వైరం ఉన్న జగన్ కి 151 సీట్లు జనం కట్టబెట్టి బాబుని ఒట్టి చేత్తో నిలిపినా కూడా బాబు ముందు పదే పదే జగన్ ఓడిపోతూనే ఉన్నారు. దటీజ్ బాబు.చంద్రబాబు మంచి పాలనాదక్షుడు అని అంటారు. పాలన సంగతేంటో కానీ వ్యవస్థల పాలన మీద చంద్రబాబు పీ హెచ్ డీ ఎపుడో చేసేశారు. అందుకే చంద్రబాబు దేశంలోనే ప్రత్యేకమైన నాయకుడు అని చెప్పాలి. ఎన్నో బీరాలు పలిగిన బీహార్ లాలూ యాదవ్ జైలు పాలై ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మరో నేత చిదంబరం, స్వతహాగా ఢక్కామెక్కీలు తిన్న లాయర్ అయి ఉండి కూడా జైలు అనుభవమేంటో రుచి చూశాడు. అద్భుత మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి నాయకులు కూడా కోర్టు మెట్లెక్కారు, కానీ చంద్రబాబు మాత్రం అసలు అటువైపే చూడనవసరం లేనంతగా అన్ని వ్యవస్థలనూ ఔపాసన పట్టేశారని అంటారు.చంద్రబాబుకు అందరూ మిత్రులే. ఆ మాటకు వస్తే ఆయనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే డౌటే. అవతలి వారు ఓకే అనాలే కానీ ఎవరితోనైనా ఆయన తన అవసరార్ధం, సందర్భానుసారం దోస్తీ కట్టగలడు. లేకపోతే మోడీని, అమిత్ షాని తిట్టిన నోటితోనే పొగడడం అంటే బాబుకే చెల్లు. మొత్తానికి బాబుకు ఇపుడు కొత్త మిత్రుడు కూడా దొరికారట. అదే కరోనా వైరస్. దాన్ని చూసి ప్రపంచం అంతా వణికిపోతూంటే చంద్రబాబు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆ సాకుతోనే లోకల్ బాడీ ఎన్నికలు రద్దు అయ్యాయి. దాని వెనకాల బాబు ఉన్నాడని సీఎం జగన్ ఆరోపించవచ్చు కాక. అలా కరోనా భయం ఇపుడు జగన్ కి పట్టుకుందంతే.చంద్రబాబు లాంటి వారికి ప్రతి నిముషమూ విలువైనదే. అటువంటి బాబుకు ఇపుడు కరోనా పుణ్యమాని ఆరు వారాల టైం లభించింది. ఈ టైం ని ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబుకు ఎవరైనా చెప్పాలా. అసలు అవసరం లేదు. లోకల్ ఫైట్ లో పాతాళానికి పడిపోయినా పార్టీ ఇమేజ్ ని మళ్ళీ లేపగలడూ, ఏకగ్రీవాలతో మురిసిపోతున్న వైసీపీకి అసలైన దగ్గులు నేర్పించగలడూ. నిన్న ఉన్నట్లుగా ఇవాళ లేదు. రేపు ఉండదు, అలా కాలాన్ని, తన మేధస్సుని నమ్ముకుని మరీ రాజకీయం చేస్తున్న చంద్రబాబు ముందు ఎవరు ఏం చేసినా అవి ఉత్త కుప్పిగెంతులే. అదే పదే పదే రుజువు అవుతోంది

Related Posts