YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఇప్పుడు అందరి చూపు సచిన్ పైలెట్ వైపు

ఇప్పుడు అందరి చూపు సచిన్ పైలెట్ వైపు

ఇప్పుడు అందరి చూపు సచిన్ పైలెట్ వైపు
జైపూర్, మార్చి 16
భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లో సక్సెస్ అయింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పదిహేను నెలల పాటు బీజేపీ నిరీక్షణ ఫలించింది. కరడు గట్టిన కాంగ్రెస్  వాదిగా ముద్రపడిన జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ తమవైపునకు తిప్పుకోగలిగింది. ఇక తర్వాత బీజేపీ లక్ష్యం రాజస్థాన్ మాత్రమే.  రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరిగి  పదిహేను నెలలు కావస్తోంది. అక్కడ కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతతోనే అధికారంలో కొనసాగుతూ వస్తోంది.ఇక్కడ కూడా సేమ్  మధ్యప్రదేశ్ రాజకీయాలే కాంగ్రెస్ లో  ఉన్నాయి. వృద్ధనేత అశోక్ గెహ్లాట్ ను ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. రాజస్థాన్ లో ఐదేళ్ల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ యువనేత సచిన్ పైలెట్ ఉన్నప్పటికీ ఆయనను పక్కన పెట్టింది. సచిన్ పైలెట్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని అప్పగించింది. రాహుల్ కోటరీలో ఉన్న సచిన్ పైలట్ ను  కాదని అశోక్ గెహ్లాగ్ కు సీఎం పదవి అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో భిన్న స్వరాలు విన్పించాయి.రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో గత  ఎన్నికల్లో 98 మంది మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ వంద మాత్రమే. ఇక్కడ కూడా సీపీఎం, ఆర్ఎల్డీ నుంచి ఐదుగురు సభ్యుల మద్దతు ఉంది. బీఎస్పీని తన పార్టీలో కాంగ్రెస్ విలీనం చేసుకుంది. ప్రస్తుతం 112 మంది సభ్యులు మాత్రమే కాంగ్రెస్ కు ఉన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా రాజస్థాన్ లో కూడా ప్రభుత్వం కుప్ప కూలిపోవడం ఖాయం. ఇక్కడ బీజేపీకి 80 మంది సభ్యులున్నారు.అంటే మరో పదిహేను మందిని తమవైపునకు తిప్పుకుంటే బీజేపీ రాజస్థాన్ లోనూ అధికారంలోకి రావడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య విభేదాలున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఇక్కడ కూడా మధ్యప్రదేశ్ సీన్ తలెత్తుతుందని కాంగ్రెస్ ఆందోళనలో ఉంది. ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకుని రాజస్థాన్ లో పార్టీని చక్కదిద్దకుంటే మరో మధ్యప్రదేశ్ గా మారక తప్పదు. సచిన్ పైలెట్ ను జాగ్రత్తగా చూసుకుంటేనే బెటర్.

Related Posts