YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరువు కోసం సీపీఐతో కాపురం

పరువు కోసం సీపీఐతో కాపురం

పరువు కోసం సీపీఐతో కాపురం
విజయవాడ, మార్చి 16
రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ఏదో ఒక ఎత్తు వేయాల్సిందే. బలంగా ఉన్న అధికార పార్టీని ఢీకొట్టాలంటే మరింత అప్రమత్తత అవసరం. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు ఒంటరి పోరాటం చేశారు. శాసనసభ ఎన్నికల్లో సయితం ఆయన ఒంటరిగానే బరిలోకి దిగారు. ఒంటరిపోరు ఆయనకు కలసి రాలేదన్నది స్పష్టమయింది. ఇప్పటి వరకూ చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ ఒంటరిగా బరిలోకి దిగింది లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో చంద్రబాబు ఎన్నికలకు వెళుతూ రు.మొన్నటి ఎన్నికలలో ఘోరమైన ఓటమితో పార్టీ నేతలందరూ డీలా పడిపోయారు. ఊహించని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేశాయి. అయితే గతంలో చంద్రబాబు మిత్రుడిగా ఉన్న పవన్ కల్యాణ్ బీజేపీతో వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబుకు మిగిలింది వామపక్షాలే. వామపక్షాల్లోనూ సీపీఎం మాత్రం చంద్రబాబుతో కలిసేందుకు సుముఖంగా లేదు. సీపీఐ గత కొద్ది రోజులుగా రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబుతో కలసి పోరాడుతోంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటంతో పాటు కొన్ని స్థానాలనైనా సాధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్  తీసుకుంటే అక్కడ సీపీఐ, సీపీఎం బలంగా ఉంది. టీడీపీకి కూడా సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. పొత్తుతో వెళితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను అయినా చేజిక్కించుకోవచ్చన్న వ్యూహంతో చంద్రబాబు ఉన్నారు.అలాగే కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ ను కూడా సీపీఐ సహకారంతో పొందవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. కమ్యునిస్టులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుండటంతో చంద్రబాబు సీపీఐతో పొత్తుకు సిద్ధపడ్డారు. ఇక సీపీఐ కూడా ఏదో ఒక పార్టీతో పొత్తుతో వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వీరి పొత్తు ఫలిస్తుందంటున్నారు. సీపీఐ క్యాడర్ కూడా ఎన్నికలను ఎదుర్కొనడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. మొత్తం మీద సీపీఐతో పొత్తుతో కనీసం కొన్ని కీలక స్థానాలను సాధించవచ్చన్న ఏకైక కారణంతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.

Related Posts