కొనసాగుతున్న బంగారం పతనం
ముంబై, మార్చి 16
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే న్యూస్. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈ రోజు కూడా పసిడి వెలవెలబోతోంది. భారీగా పతనమైంది. దీంతో బంగారం ధర వరుసగా నాలుగో రోజు కూడా తగ్గినట్లు అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో పసడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడిపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.930 తగ్గుదలతో రూ.42,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.860 తగ్గుదలతో రూ.39,340కు పడిపోయింది.పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.230 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.47,800కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. 1540 డాలర్ల పైకి వచ్చేసింది. పసిడి ధర ఔన్స్‌కు 1.78 శాతం పెరుగుదలతో 1543.40 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.02 శాతం పెరుగుదలతో 14.65 డాలర్లకు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర రూ.850 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 తగ్గుదలతో రూ.40,200కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.850 క్షీణతతో రూ.41,400కు పడిపోయింది. ఇక వెండి ధర రూ.230 తగ్గుదలతో రూ.47,800కు దిగొచ్చింది.ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.