గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ శుక్రవారం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు అందాయి. ఆనందీబెన్ పటేల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారని, ఈ రోజు నుంచే ఆమె గవర్నర్‌గా కొనసాగుతారని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక 2014లో 76 ఏళ్ల ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు, 2016 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ పదవీకాలం ముగియడంతో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.