YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం దేశీయం

అంబానీకి ఈడీ షాక్.

అంబానీకి ఈడీ షాక్.

అంబానీకి ఈడీ షాక్.
యస్ బ్యాంక్ నుంచి 12 వేల కోట్ల రుణం
ముంబై, మార్చి 16
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ సహా ఇతరులకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. సోమవారం ముంబై కార్యాలయానికి రావాల్సిందిగా తెలియజేసింది.యస్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు పొందిన పలు సంస్థల్లో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయి. అంటే రుణాలు మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ తాజాగా అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. అయితే అనిల్ అంబానీ మాత్రం ఆరోగ్య కారణాలరీత్యా మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందువల్ల ఈడీ ఈయనకు మళ్లీ ఎప్పుడు హాజరు కావాలో కొత్త డేట్ ఇవ్వనుంది.అంబానీ గ్రూప్ కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటికి చెల్లించడంతో ఈయన కంపెనీలు విఫలమయ్యాయి. అంటే ఈ రుణాలు అన్నీ మొండి బకాయిలుగా  మారిపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామర్ మార్చి 6న యస్ బ్యాంక్ కార్పొరేట్ ఎన్‌పీఏల్లో అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్‌ఎల్, వొడాఫోన్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. ఈ కంపెనీల ప్రమోటర్లు అందరికీ ఈడీ సమన్లు జారీ చేయనుంది.ఇకపోతే ఈడీ.. ప్రివెంటేషన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద అంబానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది. కాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్‌ ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. మరోవైపు సీబీఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.కాగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను ఎలాగైనా గట్టెక్కించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆర్‌బీఐ ఇప్పటికే యస్ బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు విధించింది. కస్టమర్లు అకౌంట్ నుంచి రూ.50,000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశముంది.

Related Posts