వందేళ్ళకు ఓ సారి ఒక అంటూ వ్యాధి.. ఇప్పుడు కరోనా..!
హైదరాబాద్ మార్చ్ 16
గతం లో వందేల్లకోసారి అంటువ్యాధులు వచ్చి (గత్తర)ఊళ్ళకు ఉల్లే చచ్చిపోయిన విషయం విన్నాము. తాజాగా వందేల్ల తర్వాత కరోన వ్యాది వచ్చి యావత్ ప్రపంచం గడగడ వనికి పోతుంది. గతం లోవచ్చిన అంటూ వ్యాధుల వివరాల్లోకి వెళితే... 1720లో ప్లేగు వ్యాధి : ఈ ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం పెద్దదే. ఇప్పటికి ఈ వ్యాధి పేరు వింటే భయపడాల్సిందే. ఈ వ్యాధి ఎలుకల నుంచి వచ్చింది. యూరప్ ఫ్రాన్సులోని మర్సెయిల్స్ లో బయటపడిన వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50 వేల మందిని బలి తీసుకుంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరించింది. ఈ వ్యాధి కారణంగా లక్షల మంది చనిపోయారు.. 1820లో కలరా వ్యాధి : ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తివుతుండగానే ఈ కలరా వ్యాధి బయటపడింది. ఇప్పటికి ఈ కలరా వ్యాధి గురించి ఎక్కడో ఓ చోట వినే ఉంటారు. ఫిలిప్పైన్స్ థాయ్ లాండ్ ఇండోనేషియా దేశాల్లో ఈ వ్యాధి కారణంగా లక్షమందికి పైనే చనిపోయారు.కలరా బ్యాక్టిరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు.. 1920లో స్పానిష్ ఫ్లూ : ఇక కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్ళుకు స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఒక కోటి మంది మరణించారు. ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ గుర్తుండి పోతుంది.. 2020లో కరోనా వైరస్ : స్పానిష్ ప్లూ వచ్చిన వందేళ్లకు ఇప్పుడు చైనలో కరోనా వైరస్ వచ్చింది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ కు ఇంకా మందు కనిపెట్టలేదు. దీంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇంకెంతమందిని ఈ వైరస్ తీసుకుపోతుందని భయంతో ప్రజలు వణికిపోతున్నారు.