YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఆ నిర్ణయం సరైనది కాదు

 ఆ నిర్ణయం సరైనది కాదు

 ఆ నిర్ణయం సరైనది కాదు
శ్రీకాకుళం మార్చి 16 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌పై అధికార పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. ఓ వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారంటూ సీఎం జగన్ నిన్న ఆరోపించగా.. పలువురు వైసీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా.. స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా ఎన్నికల కమిషనర్, టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేశ్‌పై ప్రజలు కోపంతో ఉన్నారని, కనిపిస్తే కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ను తాము గౌరవిస్తామని, అయితే కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సరి అయినది కాదని అన్నారు. ఎన్నికల కమిషనర్‌ కుర్చీలో కాకుండా సీఎం కుర్చీలోనే కూర్చోమనండి అంటూ రమేశ్‌పై ఘాటుగా స్పందించారు.ఇక, చంద్రబాబు వంటి నీచాతినీచ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు వ్యవస్థలకు పట్టిన భ్రష్టు వదలదని స్పీకర్ అన్నారు. టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబువి నీచ రాజకీయాలు. ఆయనకు ప్రజలు గుణపాఠం చెబుతారని,తప్పు చేసే రాజ్యాంగ వ్యవస్థలను ప్రజా ఉద్యమాల ద్వారా ఎండగట్టాలని అన్నారు.

Related Posts