YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరొనా వైరస్.... కమ్మ వైరస్..

కరొనా వైరస్.... కమ్మ వైరస్..

కరొనా వైరస్.... కమ్మ వైరస్..
విజయవాడ, మార్చి 16
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఏపీ ఎస్‌ఈస్ రమేష్‌కుమార్ తీరుపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.. తాజాగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా స్పందించారు. ఎస్‌ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నాయన్నారు తమ్మినేని. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు కుల,మతాలకు అతీతంగా ఉండాలని.. కనకపు సింహాసనం మీ శునకమును కూర్చొండబెట్టినట్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఉందని ప్రశ్నించారు.వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమే అన్నారు సీతారాం. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ పెత్తనమేంటన్నారు రాష్ట్రానికి కరోనా వైరస్ నా.. కమ్మ వైరస్‌ నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానమని.. రమేష్ కుమార్ ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు.న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌లోనూ బ్లాక్ షీట్స్ ఉన్నాయని.. కొంతమంది రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని స్పీకర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం రమేష్ కుమార్ అబ్బ జాగీరు అనుకుంటున్నారా.. రాష్ట్రానికి రావాల్సిన 14 ఆర్ధిక సంఘం నిధులు ఎవరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన 5వేల కోట్లకు పైగా నిధులు ఆగిపోతాయన్నారు. ఎన్నికల సంఘం పనికిమాలిన డైరక్షన్‌తో రాజ్యాంగ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టారని.. వెంటనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. గవర్నర్, రాష్ట్రపతికి ఈ మేరకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అన్నారు.2019 ఎన్నికల సమయంలో సీఎస్‌ మార్చితే చంద్రబాబు రాద్దాంతం చేశారని.. ఇప్పుడు అధికారుల బదిలీపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు వంటి చీడ పురుగులు ఉండకూడదని.. ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారు.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజాస్వామ్ాయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు

Related Posts