YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈసీపై సుప్రీంకు జగన్ సర్కార్

ఈసీపై సుప్రీంకు జగన్ సర్కార్

ఈసీపై సుప్రీంకు జగన్ సర్కార్
న్యూఢిల్లీ, మార్చి 16 
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లలిత్.. మంగళవారం రెగ్యులర్‌ లిస్ట్‌లో కేసును విచారణకు ఉంచాలని సూచించారు. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ మేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది.స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయంపై జగన్ సర్కార్ మండిపడుతోంది. ఎన్నికల వాయిదా అంశంపై సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లు, డయాబెటిక్‌, బీపీ, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వస్తే ఇది హానికరమైన వ్యాధిగా పరిగణించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామని.. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని.. కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts