YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఏఏ వ్యతిరేక బిల్లును చించేసిన రాజాసింగ్

సీఏఏ వ్యతిరేక బిల్లును చించేసిన రాజాసింగ్

సీఏఏ వ్యతిరేక బిల్లును చించేసిన రాజాసింగ్
హైద్రాబాద్, మార్చి 16 
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. సీఏఏకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజా సింగ్ బిల్లు పాస్ చేసిన పేపర్లను చించివేస్తూ నిరసన తెలిపారు. పోడియం వద్ద ఆయన ఆందోళన తెలిపారు.అంతకుముందు రాజాసింగ్ మాట్లాడుతూ... పౌరసత్వ చట్టం వలన ఒక్క వ్యక్తికి కూడా నష్టం కలగదన్నారు. ఒక్క ముస్లీంకు కూడా నష్టం రాదన్నారు. ఈ చట్టం వల్ల ఒకరికి నష్టం కలిగినా... తెలంగాణ వదిలి వెళ్లిపోతానన్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు రాజా సింగ్. దీనిపై తెలంగాణలో రాజకీయ నేతలు అనవసర రాజకీయం చేస్తున్నారన్నారు.తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ సభలో సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సభలో సీఏఏపై మాట్లాడిన కేసీఆర్ తనకే బర్త్ సర్టిఫికెట్ లేదన్నారు. తనలా సరైన పత్రాలు లేని వారు లక్షలమంది ఉన్నారన్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఏఏపై కేంద్రం పున: సమీక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.

Related Posts