YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 భారీగా పెరిగిన ఆన్ లైన్ సరుకులు

 భారీగా పెరిగిన ఆన్ లైన్ సరుకులు

 భారీగా పెరిగిన ఆన్ లైన్ సరుకులు
హైద్రాబాద్, మార్చి 16
కరోనా వైరస్ దెబ్బకి అందరూ భయపడి చస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే కోవిడ్ 19 వల్ల కొన్ని రంగాలకు మాత్రం కలిసొస్తోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రో నగరాల్లో షాపింగ్ మాల్స్‌ను మూసేయాలని ఆర్డర్లు జారీ చేశాయి. అలాగే ప్రజలు పబ్లిక్ ప్లేసుల్లో తిరగవద్దని సూచించాయి. దీంతో ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగాయి. మరీముఖ్యంగా ఆన్‌లైన్ గ్రాసరీ రిటైలర్ల పంటపండింది.బిగ్‌ బాస్కెట్, గ్రోఫర్స్ వంటి కంపెనీలకు ఆన్‌లైన్ ఆర్డర్లు భారీగా పెరిగాయి. మాల్స్ మూసివేయడంతో వీరికి కలిసొచ్చింది. వీటి అమ్మకాలు 80-100 శాతం పెరిగాయని టైమ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వడం కూడా ఈ కంపెనీలకు కలిసి వచ్చింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ బాట పట్టడంతో ఆర్డర్లు బాగా పెరిగాయి.బిగ్ బాస్కెట్ సీఈవో హరి మీనన్ మాట్లాడుతూ... గత రెండు రోజులుగా ఆర్డర్లలో గణనీయమైన పెరుగుదల నమోదైందని తెలిపారు. స్టోరేజ్ కెపాసిటీ, డెలివరీ వ్యాన్స్‌ సహా సిబ్బంది పెంపు దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త యూజర్లు కూడా పెరిగాయని తెలిపారు.ఇక గ్రోఫర్స్ ఫౌండర్ అల్బిందన్ ధిండ్సా మాట్లాడుతూ.. ఈ వారం ప్రారంభంలో తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అమ్మకాలు 5-7% పెరిగాయని తెలిపారు. ఇక వారాంతంలో డిమాండ్ ఏకంగా 80 శాతం పెరిగిందని పేర్కొన్నారు. గ్రోఫర్స్ రోజుకు 90,000 ఆర్డర్లు డెలివరీ చేస్తూ ఉంటుంది. ఇక బిగ్‌బాస్కెట్ అయితే రోజుకు 1.6 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తోంది.ఇకపోతే అంతర్జాతీయంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,56,000 పైకి చేరింది. ఇప్పటికే కోవిడ్ 19 వల్ల గ్లోబల్‌గా 5,833 మందికి పైగా మరణించారు. భారత్‌లో కూడా కరోనా సోకిన వారి సంఖ్య 107కు చేరింది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో దీని బారినపడే వారు ఇంకా పెరిగే అవకాశముంది.

Related Posts