YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిర్భయ నిందితుల ఉరికి అంతా సిద్ధం

నిర్భయ నిందితుల ఉరికి అంతా సిద్ధం

నిర్భయ నిందితుల ఉరికి అంతా సిద్ధం
న్యూఢిల్లీ, మార్చి 16
నిర్భయ దోషులకు మార్చి 20న ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీలోని పాటియాలా హైకోర్టు నాలుగోసారి డెత్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులను కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వారి కుటుంబాలు లేఖ రాయడం చర్చనీయాంశమయ్యాయింది. కారుణ్య మరణం కోరుతూ రాసిన ఈ లేఖపై దోషులు తల్లిదండ్రులు, సోదరులు, పిల్లలు కూడా సంతకాలు చేశారు. భవిష్యత్తులో నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే తమ అభ్యర్థను మన్నించి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని, వారిని ఉరితీయాల్సిన అవసరం లేదని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలో మహా పాతకానికి ఒడిగట్టివారినే క్షమిస్తుంటారని, పగ తీర్చుకోవడం అనేది గొప్ప విషయం కాదని, క్షమించడంలో అది గొప్పదనం ఉందని లేఖలో రాశారు.మరోవైపు, నలుగురు దోషులు వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్‌‌లను మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరితీయడానికి తీహార్ జైల్లో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలూ మూసుకుపోవడంతో ఉరిశిక్షను మరోసారి వాయిదా వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ రెండు రోజుల కిందట దోషి అక్షయ్ సింగ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా, దోషులు దాఖలు చేసిన పలు పిటిషన్లు ఢిల్లీ పాటియాలా కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని ఆయన సుప్రీంలో సవాల్ చేశాడు. వినయ్ శర్మ తరపు న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశాడు. తనకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినయ్ శర్మ పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిని రాష్ట్రపతి మార్చి 1న తిరస్కరించారు.

Related Posts