YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

హస్తినకి చేరిన చంద్రబాబు

Highlights

  • బీజేపీయేతర నేతలతో భేటీ..మద్దతు కూడగట్టడమే లక్ష్యం
  • పార్లమెంటులోనే సమావేశాలు..20కి పైగా పార్టీలతో చర్చలు
  • రాష్ట్రానికి అన్యాయంపై వివరణ..చంద్రబాబు 
హస్తినకి చేరిన చంద్రబాబు

 కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి పొద్దుపోయాక దేశ రాజధానికి చేరుకున్నారు.  రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని విపక్షాలకు వివరించి, పార్లమెంటులో ఎంపీలు, రాష్ట్రంలో ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఆయన మంగళవారం, బుధవారం ఢిల్లీలోనే గడుపుతారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్తే బాగుంటుందని ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో సూచనలకు అనుగుణంగా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఏపీకి  చేసిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం గురించి ప్రతిపక్ష నేతలందరికీ వివరించనున్నారు. ఆయా నాయకులను పార్లమెంటులోనే కలుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సుమారు 20కిపైగా పార్టీల నాయకులను కలుసుకుని రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం జరిగిందో వివరించనున్నారు. సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, అన్నా డీఎంకే, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, శివసేన, అకాలీదళ్‌, జనతాదళ్‌ (యు), జనతాదళ్‌ (ఎస్‌), జేఎంఎం, ఆప్‌, ఐయూఎంఎల్‌, ఐఎన్‌ఎల్‌డీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, లోక్‌ జనశక్తి, ఆర్‌ఎ్‌సఎ్‌సపీ తదితర పార్టీల నేతల్ని చంద్రబాబు కలుసుకునే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలుపేర్కొంటున్నాయి.మోదీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీలు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎంపీలు నిత్యం పార్లమెంటులో, బయటా దీనిపై ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తమ పోరాటానికి ఆయా పార్టీల మద్దతు కూడగట్టనున్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

Related Posts