Highlights
- విన్నీ మండేలా సతీమణి కన్నుమూత
- మదర్ ఆఫ్ ద నేషన్‌గా ఖ్యాతి
- దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆమెది కీలక పాత్ర
దక్షిణాఫ్రికాలో తెల్లజాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమెను మదర్ ఆఫ్ ద నేషన్‌గా పేర్కొంతున్న విన్నీ మండేలా (81 ) కన్నుమూశారు.విన్నీ జోహెన్నెస్ బర్గ్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత నెల్సన్ మండేలా సతీమణి విన్నీ మండేలా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడు నెల్సన్ మండేలాను వివాహమాడిన విన్నీ.. ఆయనపై 27 ఏళ్ల పాటు నిర్బంధం విధించడాన్ని నిరసిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అయితే, విన్నీ 1996లో మండేలా నుంచి విడిపోయారు. అనంతరం రెండేళ్లకే మండేలా దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మండేలా, విన్నీలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మండేలా 2013లో కన్నుమూసిన విషయం తెలిసిందే.