మరో దిశ హత్య …..రంగారెడ్డిలో యువతి దారుణహత్య
రంగారెడ్డి మార్చ్ 17
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ముగియకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని యువతిపై అత్యాచారం జరిపి.. దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలోని ఓ బ్రిడ్జి కింద నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువతి మృతదేహంపై బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఉంగరం ఉన్నట్టు గుర్తించారు. ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని.. యువతిని గుర్తించకుండా ఉండటం కోసం తలపై రాయితో బాదినట్టు తెలుస్తోందన్నారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ళ వరకు వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయివుండవచ్చని అనుమానిస్తున్నారు.