YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్.ఆర్.సి, ఎన్ పీఆర్, సీఏఏ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ఎన్.ఆర్.సి, ఎన్ పీఆర్, సీఏఏ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ఎన్.ఆర్.సి, ఎన్ పీఆర్, సీఏఏ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
   కేవలం ఏం. ఐ.ఎం,ముస్లిం ఓట్ల కోసమే వ్యతిరేకించారు: టీపీసీసీ
హైదరాబాద్ మార్చ్ 17 
ఎన్. ఆర్. సి, ఎన్ పీఆర్, సీఏఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మాణం.. కేవలం ఏం. ఐ.ఎం,ముస్లిం ఓట్ల కోసమే నని టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య  నాయక్లు అన్నారు.మంగళవారం గాంధీభవన్ లోమేడియా సమావేశం లో మాట్లాడితు ఎన్. ఆర్. సి, ఎన్ పీఆర్, సీఏఏల విషయం లోప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు ఎన్ పీఆర్ లో ఇచ్చేది డిజిటల్ డాటా.. ఎలాంటి పాత్రలు అడగం అని కేంద్రం చెప్తున్నారు.. ఎన్ పీఆర్ లో చేసిందే ఎన్. ఆర్. సి లో తెగిస్కుంటారు. అందులో ఎలాంటి అనుమానం ఉన్న డౌట్ కింద  నమోదు చేస్తారు. యెనుమరేటర్ లకు అధికారం ఇస్తున్నారు. వాళ్లంతా ఆర్.ఎస్.ఎస్ కు అనుకూలంగా ఉంటారూ. ఈ దేశ పౌరులకు మళ్ళీ ధృవీరకన ఎందుకు.. గతంలో నల్లధనం  తీస్తాం అన్నారు. ఏమైంది. అస్సాంలో ఏమైందో చూసాము..నిజంగా ఇతర దేశాల వలసదారులకు పౌరసత్వం వచ్చింది. నిజమైన అస్సామీలు పేదలు, బడుగు బలహీన వర్గాలు  పోయారు. బీజేపీ నాటకం ఆడుతుంది. ఎన్ పీఆర్ ను వ్యతిరేకంగా మాట్లాడితే దేశ దృహులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు ఎన్ పీఆర్, ఎన్. ఆర్. సి ల  షయంలో అప్రమతంగా ఉండాలి.బీజేపీ మతాల మధ్యన వైషమ్యాలు పెట్టడానికి చట్టాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వఎం చేసిన తీర్మానం కేవలం వ్యతిరేకించడానికి తప్ప ఆపేందుకు  ఉపయోగ పడదు..ఏప్రిల్ 1వ తేదీన ఎన్ పీఆర్ డాటా మొదలు పెడుతున్నారు. ఇదే డాటా ఎన్. ఆర్. సి కి వాడుకుంటారన్నారు. ఈ డాటా తర్వాత కేంద్రం పౌరసత్వం  నిరూపించుకోవాలని నోటస్లు ఇవ్వబోతోంది.అస్సాంలో కుటుంబాన్ని తాతల నాటి నుంచి పిలిపించి సమాచారం సేకరించారు. ఇదే రేపు దేశం మొత్తం అమలుకాబోతుంది.స్సాంలో 40  లక్షల మంది ఎస్సి, ఎస్టీ, మైనారిటీలు ఈ దేశ పౌరులుగా చేయకుండా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే 19 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న  కుట్రను టిఆర్ఎస్ ఎలా అడ్డుకుంటుందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ పీఆర్ కు ఒకసారి సమాచారం ఇచ్చాక మళ్ళీ మార్చే అవకాశం లేదు.2014 మార్చి 31 నాటికి  ఇండియాలో ఉన్న వారంతా భారతీయులే అని కేంద్రం ప్రకటించింది. ఇందులో ఎంత మంది భారతీయుల్లో ప్రభుత్వం ప్రకటించాలి. ప్రజలు ప్రభుత్వకుట్ర ను అర్థం చేసుకొని ప్రజలు  చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.

Related Posts