YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

తిరుమల కొండకు తగ్గిన భక్తుల రాక.. గంట వ్యవధిలోనే దర్శనం

తిరుమల కొండకు తగ్గిన భక్తుల రాక.. గంట వ్యవధిలోనే దర్శనం

 

 తిరుమల కొండకు తగ్గిన భక్తుల రాక.. గంట వ్యవధిలోనే దర్శనం
తిరుమల మార్చ్ 17
కరోనా వైరస్ ప్రభావం తిరుమల కొండపై బాగానే పడింది. ఈ వైరస్ భయంతో భక్తుల రాక భారీగా తగ్గింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. తిరుమల పర్యటనను భక్తులు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భక్తుల రాక రోజురోజుకు భారీగా తగ్గుతోంది. తిరుపతి తిరుమల పరిసరాల్లో భక్తులు ప్రజలు లేక వెలవెలబోతున్నాయి. దీంతో స్వామివారి దర్శనం గంట వ్యవధిలోనే అవుతోంది. భక్తులు క్యూలో నిల్చునే పని లేక వెంటవెంటనే దర్శనం అవుతుండడం గమనార్హం. తిరుమలలో మొదటి అడుగు అలిపిరి చెక్ పాయింట్ మొదలు శ్రీవారి ఆలయం వరకు భక్తులు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోనూ షెడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మాడవీధులు అఖిలాండం తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనం కాటేజీలు కల్యాణకట్ట యాత్రీకుల వసతి సముదాయాలు తదితర ప్రాంతాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఒకవేళ భక్తులు ఉన్నా వారంతా మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. దీంతో గదులు కూడా సులభంగా లభిస్తున్నాయి. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా కూడా తిరుమలకు రద్దీ పెరగడం లేదు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1 2 వైకుంఠం క్యూకాంప్లెక్స్లలోని కంపార్టుమెంట్లలో భక్తులు సమూహాలుగా కూర్చునే విధానానికి స్వస్తిపలికి మంగళవారం నుంచి టైంస్లాట్ ద్వారా నేరుగా క్యూలో వెళ్లి శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి 12గంటల నుంచి టైంస్లాట్ టోకెన్లు అందించేందుకు వీలుగా తిరుమల తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ టోకెన్లు తీసుకునేందుకు భక్తులు తప్పనిసరిగా ఆధార్ పాన్ ఓటర్ కార్డ్ డ్రైవింగ్లైసెన్స్ పాస్పోర్టు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి. తిరుమలలో సీఆర్వో వద్ద 7 ఆర్టీసీ బస్డాండ్లో 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతిలో విష్ణునివాసం శ్రీనివాసం రైల్వేస్టేషన్ వెనుకవున్న గోవిందరాజస్వామి 2 3 సత్రాలు ఆర్టీసీ బస్డాండ్ అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు జారీ చేస్తారు. అలాగే అలిపిరి శ్రీవారిమెట్లు మార్గాల్లో కూడా టోకెన్లు పొందవచ్చు.

Related Posts