YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు

రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు

రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు
   కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
న్యూ ఢిల్లీ మార్చ్ 17
రూ.2000 నోట్ల పై ప్రతి రోజు ఎదో ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో రూ.2 వేల నోట్లను రద్దు చేసేస్తుందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేసారు. సోమవారం లోక్ సభ లో రూ.2000 నోట్లకు సంబంధించిన ఓ ప్రశ్నకు అయన ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు అయితే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసే విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలని ప్రజలు నమ్మాల్సిన పనిలేదు అని తెలిపారు. అయితే రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. ఈ కారణంతోనే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ వంటివి ఏటీఎంలలో రూ.500 రూ.200 నోట్లను ఎక్కువగా ఉంచుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.7.40 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీని ముద్రించినట్లు అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కాగా దేశంలో చాలా చోట్ల పట్టుబడిన నకిలీ నోట్లలో రూ.2000 ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ నుంచి కూడా మన దేశంలోకి ఫేక్ రూ.2000 నోట్లు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts