టీడీపీ కార్యాలయంలో కరోనా స్క్రీనింగ్ టెస్ట్లు
అమరావతి మార్చ్ 17
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలకూ ఈ వైరస్ పాకడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయ సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. టీడీపీ కార్యాలయంకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తోంది. స్క్రీనింగ్ చేశాకే టీడీపీ ఆఫీసులోకి సిబ్బంది అనుమితిస్తోంది.