YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ  గైడ్ లైన్స్

కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ  గైడ్ లైన్స్

 

కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ  గైడ్ లైన్స్
కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. హోమ్ క్వారెంటైన్లో ఎలా ఉండాలనే దానిపై పలు సూచనలు చేసింది. ‘‘మిమ్మల్ని, మీరు ప్రేమించే వ్యక్తులను కాపాడుకోవడమే హోమ్ క్వారెంటైన్ ( స్వీయ నిర్భంధం విధించుకోవడం  )” అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న  , కరోనా సోకిన దేశాల నుంచి లేదా విదేశాల నుంచి  వచ్చినా హోమ్ క్వారెంటైన్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. హోమ్ క్వారెంటైన్లో ఉండేవారు మంచి వెలుతురుండే సింగిల్ రూమ్లో సెపరేట్గా ఉండాలి. దానికి అటాచ్డ్ బాత్ రూమ్ లేదా సెపరేట్ టాయ్ లెట్ ఉంటే బెటర్. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అదే గదిలో ఉండాల్సి వస్తే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి. కనీసం ఒక మీటర్ దూరం మెయింటెయిన్ చేయాలి. క్వారెంటైన్లో ఉండే వ్యక్తి వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు దూరంగా ఉండాలి. అలాగే ఏవైనా వ్యాధులతో బాధపడే వారికి దగ్గరగా వెళ్లకూడదు. ఎందుకంటే వారి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. తనకు కేటాయించిన గదిలోనే ఉండాలి. ఇంట్లో అటూఇటూ తిరగకూడదు.ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిళ్లు, బర్త్ డే లాంటి ఫంక్షన్లకు హాజరు కావొద్దు.  తరచూ శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి. ఇంట్లో వారు ఉపయోగించే వస్తువులు గిన్నెలు, గ్లాసులు, టవల్ లాంటివి తాకకూడదు. ఇవన్నీ తనకు సెపరేట్గా ఉంచుకోవాలి. తప్పనిసరిగా అన్ని వేళల్లోనూ సర్జికల్ మాస్క్ ను వినియోగించాలి. ప్రతి 6–8 గంటలకు మాస్క్ను మార్చాలి.  డిస్పోజబుల్ మాస్క్లను తిరిగి వాడకూడదు. యూజ్ చేసిన మాస్క్కు వైరస్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆర్డినరీ బ్లీచింగ్ సొల్యూషన్ (5 %) లేదా హైపోక్లోరైట్ సొల్యూషన్ (1%)తో శుభ్రపరచాలి. లేని పక్షంలో కాల్చేయడం లేదా పూడ్చివేయాలి. కరోనా లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు సమాచారమివ్వాలి. లేదంటే కాల్ సెంటర్ నెంబర్ 9390 289 380 కు కు ఫోన్ చేయాలి.
కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...
హోమ్ క్వారెంటైన్లో ఉండే వ్యక్తి బాధ్యతలను ఎవరో ఒకరో ఫ్యామిలీ మెంబర్ చూసుకోవాలి. ఆ వ్యక్తి ఉండే రూమ్, వేసుకునే బట్టలను ప్రతిరోజూ క్లీన్ చేయాలి. దీనికి సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ ను వినియోగించాలి. బాత్ రూమ్ను బ్లీచింగ్తో కడగాలి. ఆ వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండకూడదు. వారుండే గది/ వాళ్ల బట్టలను క్లీన్ చేసేటప్పుడు డిస్పోజబుల్ గ్లోవ్స్ ను వినియోగించాలి. గ్లోవ్స్ తీసేసిన తర్వాత చేతులను కడుక్కోవాలి. విజిటర్స్ను అస్సలే అనుమతించకూడదు. హోమ్ క్వారెంటైన్ పీరియడ్ 14 రోజులు. ఆ తర్వాత టెస్టులు చేయించుకుని నెగెటివ్ వస్తే వైరస్ లేదని అర్థం. కరోనావైరస్‌ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ  సూచించిన ఈ ఆరు సూత్రాలు పాటిస్తే కరోనావైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చు చేతులను సబ్సుతో మోచేతుల వరకు కడుక్కోండి, గోళ్ల సందుల్లో కూడామురికి లేకుండా శుభ్రం చేసుకోండి, బయటకు వెళ్లచ్చినప్పుడు తప్పకుండా చేతులు శుభ్రంచేసుకోవాలి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది సార్లు చేతులను కడుక్కోవాలి.కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకు తెలిసివాళ్లు ఎదుటపడితే కౌగిలించుకోవడం, షేక్‌హ్యాండ్స్‌ ఇవ్వడం, మానేయండి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తూడుచుకోవడం, నోట్లో వేళ్లుపెట్టుకోవడం మానేయాలి. మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏవీ లేకుండా వేసుకుంటే కోవిడ్‌ 19 మీకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అరచేతులను కాకుండా మోచేతులను అడ్డుపెట్టుకోవాలి.జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లకండి, మంచినీళ్లు ఎక్కువ తాగండి. నీటిని గడగడ తాగకుండా ఎక్కువసేపు స్విప్‌ చేయడం, వేడి నీళ్లయితే చాలా మంచిది.వాట్సప్‌లో వచ్చే ప్రతీ వార్తను దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజం ఎంతో తెలియకుండా ఫార్వర్డ్‌ చేయకండి. దీనివల్ల అనవసర భయందోళన కలుగుతుంది. ఇది వైరస్‌ కన్నా ప్రమాదకరమైనది.

Related Posts