YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లోక్‌సభ దృష్టికి  స్థానిక సంస్థల ఎన్నికల  వాయిదా

లోక్‌సభ దృష్టికి  స్థానిక సంస్థల ఎన్నికల  వాయిదా

లోక్‌సభ దృష్టికి  స్థానిక సంస్థల ఎన్నికల  వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 17 
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్‌సభలో ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు వ్యాఖ్యానించారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఎంపీ శ్రీకృష్ణదేవారాయలు మాట్లాడుతూ.. ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని గాని, అధికారులను గాని సంప్రదించలేదని తెలిపారు.రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశారని, జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచారని ఎంపీ శ్రీకృష్ణదేవారాయలు వెల్లడించారు. కలెక్టర్లు బ్యాలెట్ పత్రాలు కూడా సిద్ధం చేశారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుందని, రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందని ఎంపీ శ్రీకృష్ణదేవారాయలు చెప్పారు. మూడు, నాలుగు వారాల పాటు కరోనా వ్యాప్తి అదుపులో ఉంటుందని, ఈలోపు తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. అయితే రాష్ట్రంలో ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5,100 కోట్లు ఆగిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకొస్తున్నామని, ఇప్పటికే లోటు బడ్జెట్‌ ఇబ్బందులు ఎదుర్కొటున్న ఏపీని ఈ విషయంలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts