YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికా, ఫ్రాన్స్ షట్‌డౌన్!

అమెరికా, ఫ్రాన్స్ షట్‌డౌన్!

అమెరికా, ఫ్రాన్స్ షట్‌డౌన్!
న్యూఢిల్లీ, మార్చి 17 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య సోమవారం నాటికి 1.75 లక్షలు దాటింది. ఈ వైరస్ కారణంగా చైనాలో 3213 మంది చనిపోగా.. ఇటలీలో 2158 మంది ప్రాణాలు వదిలారు. చైనా తర్వాత ఇటలీలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ దేశంలో 28 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాటికి కోవిడ్ 7007 మందిని బలి తీసుకుంది. భారత్ విషయానికి వస్తే.. మన దేశంలో 114 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఏపీకి పొరుగున ఉన్న ఒడిశాలోనూ తొలి కోవిడ్ కేసు నమోదైంది.కర్ణాటకలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 10కి చేరింది. దేశంలో ఇద్దరు కరోనా బారిన పడి చనిపోగా... మొదటి కోవిడ్ మరణం కర్ణాటకలోనే నమోదైన సంగతి తెలిసిందే.చైనాలో కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఆన్‌లైన్ ఆర్డర్లు పెరుగుతుండటంతో.. లక్ష మంది వర్కర్లను నియమించుకోవాలని అమెజాన్ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం భయాలతో 7.31 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. కరోనా కట్టడి కోసం ప్రజలు 15 రోజుల వరకూ ఇళ్లకే పరిమితం కావాలని ఫ్రాన్స్ కోరింది. ఆదేశాలను అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.అమెరికా 4300 మందికిపైగా కరోనా సోకగా... 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేజారుతుండటంతో.. కరోనాను అదుపులోకి తేవడం కోసం అమెరికా ఆంక్షలు విధించింది. ప్రజలు ఎటూ వెళ్లకుండా కట్టడి చేస్తోంది. సమూహాలు ఏర్పడొద్దని అధ్యక్షుడు ట్రంప్ ప్రజలను కోరారు. కోవిడ్ ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ను కట్టడి చేయడం కోసం న్యూజెర్సీ, శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. దీన్ని బట్టే అమెరికాలో పరిస్థితి ఎలా ఉందనే అర్థం చేసుకోవచ్చు.
 

Related Posts