YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల వాయిదాతో అభ్యర్థులకు భారం

ఎన్నికల వాయిదాతో అభ్యర్థులకు భారం

ఎన్నికల వాయిదాతో అభ్యర్థులకు భారం
గుంటూరు, మార్చి 18, స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడటంతో బరిలో ఉన్న అభ్యర్థులకు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదీ అంతుపట్టక ప్రచారభారం, రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈసారి నామినేషన్‌లకు ఎన్నికలకు మధ్య ప్రభుత్వం తక్కువ సమయం కేటాయించడంతో ఖర్చు తగ్గుతుందని భావించిన వైసిపి, టిడిపి అభ్యర్థులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. 45 రోజుల పాటు ఎన్నికలు వాయిదా పడటంతో అప్పటి వరకు అంతర్గత ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు రోజు వారీ ఖర్చులకు ఇంధనం అడుగుతున్నారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. వాహనాలకు నిత్యం పెట్రోలు, డీజిల్‌ సరఫరాకు, రోజువారీ ఆహార పానీయాలు అందించేందుకు భారీగా ఖర్చులు అవుతున్నాయి. ఇంతటి వ్యయ భారాన్ని తప్పించుకోవాలంటే ఒక్కటే పరిష్కారమని భావిస్తూ ఎన్నికల వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం, వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాని ఎన్నికల వాయిదాను తను అనుకూలంగా మలుచుకోవడం కోసం ఈ వాయిదా కొనసాగింపునకు టిడిపి ప్రయత్నిస్తుంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై బరిలో ఉన్న అభ్యర్థులంతా అయోమయంలో పడ్డారు. ఏకగ్రీవం ఎన్నికయిన వారు మాత్రం కొంత ప్రశాంతంగా ఉన్నారు.జిల్లాలో 8 మంది జెడ్పీటీసీ,226 ఎంపీటీసీ లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారు కొంత వరకు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. నామినేషన్ల ప్రక్రియ మధ్యలో ఎన్నికలు వాయిదా పడటంతో కొంతమంది బీ-ఫారాలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. దీంతో మళ్లీ ఆయా వార్డుల్లో అసమ్మతి సెగలు వచ్చి అభ్యర్థిత్వంపై స్పష్టతరాక భవిష్యత్తుపై బెంగతో ఉన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ లో ఇప్పటికీ టిడిపి,వైసిపి అభ్యర్థులకు బీ-ఫారం అందనీ పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి ఇంకా నాలుగు మునిసిపాలిటీల్లో ఉంది. అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా నిలిచి పోవడంతో సర్పంచ్‌ పదవికి ఎంపికయిన అభ్యర్థులకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే వరకు తమకు ఆందోళన తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు
ఏలూరులో సేమ్ సీన్
స్థానిక ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ కొనసా గుతోంది. ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించడంతో పోటీదారులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఎన్నికల నిలుపుదలపై అటు అధికారపార్టీ అభ్యర్థులు, ఇటు ప్రధాన ప్రతిపక్షం టిడిపి అభ్యర్థుల్లోసైతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరిషత్‌ ఎన్నికల విత్‌డ్రా ప్రక్రియ ముగిసింది. ప్రత్యర్థులను విత్‌డ్రా చేయించి ఏకగ్రీవంగా గెలుపు సొంతం చేసుకోవాలని అధికారపార్టీ యత్నించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అనుకున్నట్లుగానే రెండు జడ్‌పిటిసి, 68 ఎంపిటిసి స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. విత్‌డ్రాల పర్వం ముగిశాక బయటకొచ్చి ప్రచారం మొదలు పెట్టారు. ఐదు రోజుల్లో ఎన్నికలు పూర్తవుతా యని అంతా భావించారు. ఎన్నికలు వాయిదా పడటంతో అధికార పార్టీ నుంచి ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులకు మళ్లీ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ తమ పార్టీలోకి వచ్చేయాలని, ప్రచారం చేయకుండా మౌనంగా ఉండాలని బెదిరింపులకు దిగుతు న్నట్లు ప్రచారం సాగుతోంది. పోడూరు టిడిపి జడ్‌పిటిసి అభ్యర్థి ఉదంతమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని చెబుతున్నారు. టిడిపి జడ్‌పిటిసి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన నడింపల్లి మురళీరాజు పార్టీ బి.ఫారంసైతం అందుకుని ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల వాయిదా తర్వాత అనుహ్యంగా మంత్రి చెరుకువాడ రంగనాథరాజు సమక్షంలో వైసిపిలో చేరిపోయారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పార్టీలో చేర్చుకున్నట్లు ఆరోపణలు

Related Posts