YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వందకు మూడు కిలోల చికెన్

వందకు మూడు కిలోల చికెన్

వందకు మూడు కిలోల చికెన్
ఒంగోలు, మార్చి 18, కిలోలు, కిలో రూ.40లకే చికెన్‌ అని బోర్డులు పెట్టి అమ్మకాలు సాగించడంతో ప్రజలు ఆ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. కిలో రూ.80 అమ్మితే కొనేందుకు చికెన్‌ దుకాణాల వైపు కన్నెత్తి చూడని జనం కిలో రూ.40 అని చెప్పగానే పరుగులు తీస్తున్నారంటే కరోనా భయం ప్రజల్లో ఉందో లేదో అర్థమవుతుంది. పట్టణంలో ఆదివారం అనేక చోట్ల కేజి రూ.80, రూ. 60 అమ్మిన దుకాణాల వద్దకు కొనుగోలు దారులు రాలేదు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద హరిబాబు చికెన్‌ దుకాణాలలో కేజి రూ.40 కే ఇస్తున్నారని తెలుసుకున్న ప్రజలు వందల సంఖ్యలో దుకాణం వద్ద క్యూ కట్టారు. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ రాదని డాక్టర్లు ఒక పక్క చెపుతున్న దానిని ఎవ్వరు వినిపించుకోకుండా చికెన్‌ కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. అదే కేజి రూ.40 అనగానే వేలమంది చికెన్‌ కొనుక్కెళ్లి తినడం విశేషం. చికెన్‌ తింటే కరోనా వస్తుందని వదంతులు వ్యాపించి చికెన్‌ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఆదివారం అంటేనే చికెన్‌ షాపులు లింగసముద్రంలో కిటకిటలాడుతాయి. కరోనా దెబ్బకు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ప్రజలు చికెన్‌ కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో ఎక్కువ మంది చేపలను తీసుకువెళ్తున్నారు. కరోనా దెబ్బకు చికెన్‌ రేట్లు భారీగా పడిపోయిన లింగసముద్రంలో మాత్రం రేటు తగ్గడం లేదు. కొన్నిచోట్ల కోళ్లను ఉచితంగా తీసుకువెళ్తున్న ఇక్కడ మాత్రం కిలో రూ.100లకే అమ్ముతున్నారు. ఒకవైపు చికెన్‌ తింటే కరోనా వస్తుందని భయపడుతున్న ప్రజలకు మరోవైపు చికెన్‌ రేట్లు తగ్గకపోవడంతో జనం చికెన్‌ షాపుల వైపుకు వెళ్లకుండా చేపలు కొనడానికి మొగ్గుచూపుతున్నారు. కిలో మాంసం కొంటే కిలో మాంసం ఫ్రీ అన్న చందంగా కిలో కోడి మాంసం రూ.50లు, రెండు కిలోలు రూ.100లు అమ్మకాలు జోరుగా ఉన్నాయి. మండల కేంద్రమైన ఉలవపాడులో కోడి మాంసం రూ.50లకు చౌక ధరగా దొరుకుతుంది.ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని గ్రామాలలో మైకులు పెట్టి మరి చక్కర్లు కొడుతూ ప్రచారం హోరెత్తుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్‌తో భయబ్రాంతులతో ఉంటే మరో వైపు కోడి మాంసం దుకాణ దారులు ధర తగ్గిందని ప్రచారం చేస్తున్నారు.

Related Posts