YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గిట్టుబాటు ధరల్లేక టమాటా రైతులు

గిట్టుబాటు ధరల్లేక టమాటా రైతులు

గిట్టుబాటు ధరల్లేక టమాటా రైతులు
విజయవాడ, మార్చి 18, విజయవాడ రైతు బజారులో కిలో టమోటా రూ.12. జిల్లాలో పలు ప్రాంతాల్లో రైతులు పండించిన టమోటాకు వ్యాపారులు చెల్లిస్తున్నది కిలోకి రూ.2.33 పైసలు మాత్రమే. 30 కిలోల బాక్స్‌ ధర అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి ఇది ఓ సామెత కాదు. రైతుల నడిగితే ఇది తమకు నిత్యం ఎదురయ్యే జీవిత సత్యం అని చెబుతారు. తాజాగా టమోటా రైతులు ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని చూస్తే కడుపుతరుక్కు పోతోంది. తీవ్ర మనోవేధనకు గురైన మోపిదేవి మండలం కోసూరువారిపాలేనికి చెందిన ఓ రైతు మార్కెట్‌కు తీసుకెళ్లిన లారీని తిప్పి తీసుకొచ్చి దానిలోని టమోటాలను కృష్ణానదిలో గుమ్మరించాడు. ఈ మండలంలో పరిస్థితిపై ఆరా తీస్తే.. ఈ సీజన్‌లో ఎకరం సాగు చేసిన మోపిదేవిలంకకు చెందిన ఉప్పాల శ్రీనివాసరావు ఉత్తర చిరువోల్లంక విశ్వనాథపల్లి వేణులు రూ.30 వేలు, నాగాయతిప్పలో 50 సెంట్లు సాగు చేసిన విశ్వనాధపల్లి రాజారావు రూ.15 వేలు వరకు నష్టపోయారు. తాజాగా వారి సాగు చేసిన భూముల్లో సాగవుతున్న తోటలో టమోటా కాపున్నా కోసి మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు వెనుకాడుతున్నారు. కోత కూలీ, కిరాయి కూడా రాదని పంటను చేలోనే వదిలేశారు. ఈ సీజన్‌లో జిల్లాలో 2,050 ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఇలాగే ఉంది.ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని ప్రకటిస్తాయి. అయితే పుట్టెడు కష్టాలను ఎదుర్కొంటున్న టమోటా రైతులను ఆదుకోవడానికి మాత్రం చిల్లుగవ్వ విడుదల చెయ్యలేదు. వారి కష్టాలను వినే పాలకులే కరువయ్యారు. ధరల స్థిరీకరణ నిధి టమోటా రైతులకు అక్కరకు రాలేదు.జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని లంక భూముల్లో, పశ్చిమ ప్రాంతంలో నీటి వనరులు అందుబాటులో ఉన్న భూముల్లో డిసెంబర్‌ నుంచి మార్చి వరకు టమోటాను సాగు చేస్తారు. ఈ సమయంలోనే టమోటా సాగుకు ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలిస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఎకరానికి 30 వేల కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఈ సీజన్‌లో ఇతర ప్రాంతాల్లో సైతం టమోటా అధికంగా పండటంతో ఏటా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో టమోటాను ప్రొసెసింగ్‌ చేసి జ్యూస్‌, సాస్‌ తీసి ప్యాకెట్లలో నిల్వ చేయాల్సివుంది. జిల్లాలో ఎక్కడా ప్రొసెసింగ్‌ యూనిట్లు అందుబాటులో లేకపోవడంతో సమస్యగా మారింది. వ్యాపారులు అడిగిన ధరకే రైతులు విక్రయించాల్సి వస్తోంది. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పండుతున్న అరటి, మామిడి, ఇతర పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వీటిని ప్రోసెసింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేసి నిల్వ ఉంచుకునే వెసులుబాటు ఉంది. ఈ ఉద్దేశ్యంతోనే బాపులపాడు మండలం మల్లవల్లిలో ఫుడ్‌ పార్కులో కేంద్ర ప్రభుత్వం రూ. 83 కోట్లతో సెంట్రల్‌ ప్రొసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పింది. దీనిలో అనేక ఆధునిక పరికరాలను ఉంచారు. ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఈ సీజన్‌లో అందుబాటులోకి రాలేదు.

Related Posts