YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కన్నాకు తప్పని పదవీ వియోగం

కన్నాకు తప్పని పదవీ వియోగం

కన్నాకు తప్పని పదవీ వియోగం
గుంటూరు, మార్చి 18
ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎపుడూ పక్క వాయిద్యంగానే ఉంది. ఆ పార్టీ పొత్తులతోనే ఉనికి కొనసాగిస్తూ వచ్చింది. అటువంటి బీజేపీ ఇపుడు జనసేనతో జతకట్టింది. రెండు పార్టీలూ ఒకే రకమైనవి. సరే అవన్నీ పక్కన పెడితే జగన్ కి కేంద్రం అవసరం ఉంది. కేంద్రానికి జగన్ అవసరం ఉంది. దాంతో రెండు పార్టీలు కేంద్ర స్థాయిలో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నాయి. బీజీపీ పెద్దలకు కూడా ఇప్పటికిపుడు ఏపీ నుంచి భారీ ఎత్తున సీట్లూ, ఓట్లూ వచ్చిపడతాయన్న ఆశలేమీ లేవు. దాంతో తమ పార్టీ నేతలను అలా వదిలేసి తాము జగన్ తో మంచి రిలేషన్లు పెట్టుకుంటున్నారన్నది ఢిల్లీ వర్గాల ప్రచారం.ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి ఇపుడు బరువుగా మారారని అంటున్నారు. ఆయన సొంత ఇలాకాలో కూడా బలం లేదని గత ఎన్నికలతో తేలిపోయింది. ఈ నేపధ్యంలో కన్నా జగన్ మీద ఒంటి కాలుతోనే లేస్తున్నారు. అయిన దానికీ కాని దానికీ ఆయన విరుచుకుపడుతున్నారు. పైగా ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన సుజనాచౌదరితో దోస్తీ చేస్తున్నారు. అచ్చం చంద్రబాబు భాషను వాడడం ద్వారా జగన్ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. జనంలో జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం ద్వారా టీడీపీకే ఇండైరెక్ట్ గా కన్నా మేలు చేస్తున్నారని అంటున్నారు.ఇక కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ కన్నా విషయంలో బీజేపీ హై కమాండ్ కి ఏమైనా చెప్పారా అన్న డౌట్లు వస్తున్నాయి. తన మీద హార్ష్ గా కామెంట్స్ చేస్తున్న బీజేపీ పెద్దను ఏపీ కుర్చీ మీద నుంచి దించాలని కోరుకున్నారా అన్న అనుమానాలూ ఉన్నాయి. గతంలో కూడా బీజేపీలో రెండు వర్గాలు ఉండేవి. ఒక వర్గం బాబుని సమర్ధిస్తే మరో వర్గం వ్యతిరేకించేది. ఇపుడు జగన్ కూడా ఏపీలో బీజేపీ కాస్తా సౌండ్ తగ్గించాలని ఆశిస్తున్నారుట. మరి జగన్ కోరారో. ఆయన మనసును అర్ధం చేసుకున్నారో తెలియదు కానీ హై కమాండ్ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా కన్నాని తప్పించేస్తున్నారుట. ఈ విషయంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా కన్నాకు వ్యతిరేకంగా అధినాయకత్వానికి చెప్పారని సమాచారం.ఇక కన్నా ప్లేస్ లోకి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, యువ నేత పీవీఎన్ మాధవ్ కొత్త ప్రెసిడెంట్ గా వస్తున్నారని టాక్. ఆయన తండ్రి పీవీ చలపతిరావు వాజ్ పేయ్, అద్వానీ కాలం నాటి వారు. పైగా మాధవ్ ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నవారు. యువకుడు, ఆచీ తూచీ మాట్లాడుతారు, టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు ఉండవు. ఇవన్నీ చూసుకునే ఆయన్ని హై కమాండ్ ఎంపిక చేస్తోందట. లోకల్ బాడీ ఎన్నికల తరువాత మాధవ్ మెడలో ఏపీ అధ్యక్ష వరమాల పడుతుందని భోగట్టా. తెలంగాణాలో బండి సంజయ్ తరహాలో ఏపీలో కూడా యువ నేతకు పగ్గాలు అందుతున్నాయన్నమాట. మొత్తం మీద కన్నాలా రోజుకు నాలుగుసార్లు జగన్ మీద విరుచుకుపడే బీజేపీ నుంచి నెమ్మదిగా మాట్లాడే మాధవ్ వస్తున్నారన్నమాట. ఇది జగన్ కి కూడా ఊరటని ఇచ్చే అంశమే. మరి జగన్ కూడా బాబులా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుని ఇలా చేయించారా అన్నది ఒక చర్చగా ఉంది.

Related Posts