దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
-థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు కూడా -రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచనలు జారీ -ఈయూ దేశాలు, బ్రిటన్, టర్కీల నుంచి వచ్చేవారిపై నిషేధం
మార్చి 18
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు (అడ్వయిజరీ) జారీ చేసింది. అన్ని థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని నిర్దేశించింది. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాలని సూచించింది. సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని పేర్కొంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ 15 నిబంధనలను విధించింది. ఇందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని సూచించింది. మార్చి 31 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వీటిని సమీక్షిస్తామని పేర్కొంది. కేంద్రం 15 షరతులు నిర్దేశించింది.