YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

శాంతి బద్రతల పర్యవేక్షణ, మావోయిస్టు కదలికల పై నిఘా

శాంతి బద్రతల పర్యవేక్షణ, మావోయిస్టు కదలికల పై నిఘా

శాంతి బద్రతల పర్యవేక్షణ, మావోయిస్టు కదలికల పై నిఘా
తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి
ఆసిఫాబాద్, మార్చి 18
తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్ హెలికాప్టర్ ద్వారా ఆసిఫాబాద్ చేరుకొని జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిపి గారు  జిల్లాల అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించారు. డిజిపి గారు మాట్లాడుతూ పోలీస్ అధికారులందరూ క్వాలిటీ  అఫ్ పోలీస్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు మరియు పీపుల్ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రజలను సమైక్యం చేసి ఒక పార్టనర్ షిప్ మోడ్ లో పోలీసింగ్ లో వారికి బాగస్వామ్యం కల్పిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తూ మరియు జిల్లాలోని  ప్రజలందరికి మరింత మెరుగైన సేవలందించడo కొరకు చర్చించడం జరిగింది. వీటిలో ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావాలి మరియు ఎక్కడెక్కడ నేర నిరోదన మరియు నేరస్తులను పట్టుకోవడం మరియు నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి బద్రతల పర్యవేక్షణ అలాగే మావోయిస్టు కదలికలు ఇంటర్ స్టేట్ బార్డర్స్ పై నిఘా మొదలగు సమస్యలన్నింటిని విశధీకరించి ఇక్కడ ప్రతి పోలీస్ అధికారి యొక్క ఎఫ్ఫర్ట్స్ ని వారి ద్వారానే వినడం జరిగింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కి ఎంతో ప్రాదాన్యతని ఇచ్చింది మరియు మన రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన శ్రీ కల్వకుoట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖను ఆధునీకరించడం, ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయడం జరిగింది. అదేవిదంగా అభివృద్ధి కార్యక్రమాలలో పోలీస్ లు బాగస్వాములo అవుతూ ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలని ఆలోచిస్తూ ఇవన్ని ప్రజలకు తెలిసేవిదంగా చేస్తు వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని వారి ఆలోచనలు స్వీకరించి మన యొక్క పనిలో క్వాలిటీ ని మరింతగా తీసుకొచ్చి సిటిజెన్ సార్టిసిఫ్యాక్షన్ పెంపుదల  గురించి అన్ని చర్యలు తిసుకువన్తున్నాం అని వివరించారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలతో మమేకమై వారికి సేవలందిస్తూ పోలీస్ శాఖ పై మరింత నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా పోలీసు వారి విధి నిర్వహణలో గురించి వివరించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు పట్టణాల్లోని సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని కోరారు.నేరాల నియంత్రణలో ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు దేశంలో మంచి గుర్తింపును సాధించడం జరిగిందని, ఇకముందు కూడా అదే విధంగా ముందుకు సాగాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను అనుసరించే విధంగా కృషి చేయాలని సూచించారు.వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ ఐజిపి వై.నాగిరెడ్డి,అడిషనల్ డిజి ప్రభాకర్ రావు,ఐజీపి శ్రీనివాస్ రెడ్డి,రామగుండం కమిషనర్ శ్రీ సత్యనారాయణ, ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ.విష్ణు ఎస్ వారియర్,నిర్మల్ ఎస్పీ శ్రీ.శశిధర్ రాజు, ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ ఐపీఎస్ హర్ష వర్ధన్,ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ వైవీస్. సుధీంద్ర, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్, అన్ని జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related Posts