"జ్ఞాపకాలు లేకుండా మనసు ఎలా ఉంటుంది ?"
శుద్ధ మనసు అంటే జ్ఞాపకాలు ఏవీ లేని మనసు. మనం ఏది చేయాలనుకుంటున్నామో అదే జ్ఞాపకం వస్తుంది కానీ మనలో ఉన్న జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగారావు. కాబట్టి జ్ఞాపకం అంటే కోరిక. కోరిక, ఆలోచన వేర్వేరు. జీవనం ఉన్నంతకాలం ఆలోచనలు తప్పవు. కానీ జీవనానికి అవసరం లేని కోరికలు జ్ఞాపకానికి కారణమైన మనసు శుద్ధతను భంగపరూస్తున్నాయి. కోరికలేని మనసుకే దైవ దర్శనం అనుభవం అవుతుంది. ఆ స్థితి పొందిన వ్యక్తి జీవనం నిద్రిస్తూ ప్రయాణాన్ని పూర్తి చేసినంత సునాయాసంగా సాగిపోతుంది. జ్ఞాపకాలే మనసు యొక్క శుద్ధతను భంగపరుస్తున్నాయి. ఏ జ్ఞాపకాలు లేని మనసు నిద్రాస్థితిలాంటి హాయినిస్తుంది,, భగవంతుడి ఎడల సంపూర్ణ శ్రద్ధాసక్తులు ఉన్నవారికి అవి సులభంగా అందుతాయి !నేటి శాస్త్ర విజ్ఞానం మానవునికి ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు, భోగభాగ్యాలు ఉన్నా కూడా మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలదు. ఈ సుఖం కాదు ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నా కూడా మానసిక శాంతి లేక ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య, అజ్ఞానం. తెలుసుకోవలసిన దానిని తెలుసుకోలేకపోవడమే అవిద్య. ఈ అవిద్య పోవాలంటే దైవ గ్రంథములను చక్కగా చదువుతుండాలి. అందులోపలి సారం గ్రహిస్తుండాలి. భగవంతుణ్ణి మనసు నిండుగా స్మరిస్తుండాలి. అపుడే మానవునికి నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. ఈ అవిద్య అజ్ఞానం పోవాలంటే ఇదొక్కటే మార్గం తప్ప మరొక మార్గం లేదు.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో