YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డపై అభిశంసన..?

నిమ్మగడ్డపై అభిశంసన..?

నిమ్మగడ్డపై అభిశంసన..?
హైద్రాబాద్, మార్చి 18
గన్ దారి రహదారి. అడ్డువస్తే ఎదుటి వారికి ఇబ్బందైనా, రాజకీయంగా తనకు ఇరకాటమైనా కూడా జగన్ ముందుకే వెళ్తారు. ఆయన పదేళ్ళ రాజకీయం తీరు చూసిన వారికి ఇది కచ్చితంగా అర్ధమవుతుంది. జగన్ ఇపుడు అభిమానం దెబ్బతిన్న సుయోధనుడిలా ఉన్నారు. జగన్ టైం బాండ్ ప్రొగ్రామ్స్ అన్నీ పది నెలల కాలంలో చకచకా సాగుతూ వచ్చాయి. దానికి తొలి అంతరాయం శాసనమండలిలో ఏర్పడింది విశాఖను రాజధానిగా చేసుకుని ముందుకు పోదామని శాసనసభ ప్రత్యేక సమావేశాలు జగన్ పెడితే అంతే తెలివిగా చంద్రబాబు మండలిలో అడ్డుపుల్ల వేయించారు. అంతే మండలి రద్దుకు జగన్ ప్రతిపాదించేశారు.ఇక ఇపుడు రెండవ ఆటంకం స్థానిక ఎన్నికలకు బ్రేక్ రూపంలో వచ్చింది. జగన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మార్చి అంతానికి లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి. అంతకు ముందు ఉగాది రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసుకోవాలి. ఇక ఏప్రిల్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మండలి రద్దు తరువాతనే పూర్తి బడ్జెట్ మీటింగు నిర్వహించాలి. ఈ లోగా ఏప్రిల్ నెల నుంచి రాజధాని విశాఖకు తరలింపు వ్యవహారమంతా చూసుకుని జూన్ కల్లా తట్టా బుట్టా అమరావతి నుంచి సర్దేయాలి. దీనికి విఘాతం కలిగించేలా అర్ధాంతరంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు ఈసీ రమేష్ కుమార్. మళ్ళీ ఎపుడు జరుగుతాయో తెలియదు. దాంతో జగన్ ఈ పరిణామాలతో మండిపోతున్నారని అంటున్నారు.ఇపుడు జగన్ టార్గెట్ గా ఈసీ రమేష్ కుమార్ ఉన్నారు. ఆయన పదవీకాలం 2021 వరకూ ఉంది. అంటే మరో ఏడాది అన్నమాట. ఇపుడు ఆయనతో పెద్ద పేచీ వచ్చింది. దాంతో ఆయన్ని ఎన్నికల ప్రధానాధికారిగా జగన్ చూడకూడదనుకుంటున్నారు. అయితే అది జగన్ చేతిలో లేని వ్యవహారం. ఆయనది రాజ్యాంగబద్ధ పదవి. ఆయన నియామకంపైన ఏపీ సర్కార్ సిఫార్స్ చేస్తే కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ విధంగా రాష్టపతి ఉత్తర్వుతో నియమించబడిన పదవి అది. అందువల్ల జగన్ తో విభేదించారన్న కారణంగా ఈసీని ఇంటికి పంపించడం సాధ్యం కాదుఅయితే ఏపీ సర్కార్ కి మరో మార్గం ఉంది. అది ఆయన్ని అభిశంసించి కేంద్రానికి తీర్మానం పంపడం. అసెంబ్లీలో మూడు వంతుల మెజారిటీతో ఈ తీర్మానం నెగ్గాలి. జగన్ కి అక్కడ అంతటి బలమూ ఉంది. కానీ శాసనమండలి ఇంకా రద్దు కాలేదు. దాంతో అక్కడ యధాప్రకారం ఈ తీర్మానాన్ని టీడీపీ అడ్డుకుంటుంది. ఆయన్ని రక్షిస్తుంది. దాంతో అధికార వికేంద్రీకరణ బిల్లు మాదిరిగానే ఇది కూడా పెద్ద ఎదురుదెబ్బ కొడుతుంది. దాంతో జగన్ తో పాటు ఆయన సన్నిహితులకు ఏమీ పాలుపోవడంలేదుట. అయితే కేంద్రం ద్వారా చెప్పించి ఆయన పదవికి ముప్పు తేవచ్చు. అయితే కేంద్రం వద్ద ఇప్పటికీ శాసనమండలి రద్దు బిల్లుకే అతీ గతీ లేదు. దాంతో రమేష్ కుమార్ వ్యవహారం కూడా తెస్తే ఏం చేస్తారో డౌటే. దాంతో ఈసీ ఇపుడు జగన్ సర్కార్ కి పెద్ద ప్రశ్నగా మారారని అంటున్నారు.

Related Posts