YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా దేశీయం

ఎవ్వరికి అర్థం కానీ బాషా

ఎవ్వరికి అర్థం కానీ బాషా

ఎవ్వరికి అర్థం కానీ బాషా
చెన్నై, మార్చి 18
రజనీకాంత్ సేమ్ టు సేమ్ ఏపీలో పవన్ కల్యాణ్ లాగానే తప్పులో కాలేశారు. తనకు సీఎం పదవి అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను పూర్తిగా నిరాశపర్చాయి. పార్టీ విజయం సాధిస్తే వేరే వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెడతానని చెప్పడం రజనీకాంత్ పలాయన వాదానికి నిదర్శనమంటున్నారు. ఎన్నికలకు గట్టిగా ఇంకా ఏడాది లేవు. ఈ సమయంలో రజనీకాంత్ ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందిరజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ పార్టీ ప్రకటన చేయలేదు. ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశముంది. పూర్తిగా రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. రజనీకాంత్ కు నిజంగా రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యముంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.రజనీ కాంత్ మాటల్లోనే రాజకీయ భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. డీఎంకే, అన్నాడీఎంకేలను ఎదుర్కొనడం కష్టమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు భయంతో కూడినవే. జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఉన్నా దానిని వినియోగించుకునేందుకు రజనీకాంత్ సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. నిజాయితీ, నిబద్దతో పనిచేస్తూ పదవుల కోసం కాకుండా సేవ చేసే వారే తన పార్టీలోకి రావాలంటూ పిలుపునివ్వడం కూడా ఆశ్చర్యపర్చే విధంగా ఉంది. నేటి రోజుల్లో రాజకీయాలంటేనే వ్యాపారం. ఆ సంగతి రజనీకాంత్ విస్మరించారా? అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.దేవుడు శాసిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన రజనీకాంత్ దాదాపు రెండున్నరేళ్ల నుంచి నానుస్తూనే వస్తున్నారు. పార్టీ పెట్టి విజయం సాధించడమంటే అంత సులువు కాదని సహచరులు రజనీకాంత్ తో చెప్పబట్టే ఆయన మనసు మార్చుకున్నారని అర్థమవుతోంది. రజనీకాంత్ పార్టీ పెట్టినా ఆయన సీఎం పదవి చేపట్టబోనని తేల్చేయడంతో ఆ పార్టీ యుద్ధానికి ముందే చేతులెత్తేసినట్లే చెప్పాలి. రజనీకాంత్ వ్యాఖ్యలు ఒక రకంగా డీఎంకే లాంటి పార్టీ నెత్తిన పాలు పోసినట్లయింది. రజనీ రాక కోసం ఇక ఎదురు చూడాల్సిన పనిలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related Posts