YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కుల కుంపట్లు.. సిగపట్లు

కుల కుంపట్లు.. సిగపట్లు

కుల కుంపట్లు.. సిగపట్లు
విజయవాడ, మార్చి 18,
సమాజం అంటేనే అన్ని కులాల సమ్మేళనం. ఒక కులం వారు ఎంత గొప్పవారు అయినా కూడా మిగిలిన వారి ఆదరణ, తోడు లేకుండా ముందుకుసాగలేరు. ఏపీ రాజకీయాల్లో కులాల ప్రస్థావన ఎపుడూ ఉన్నదే. కానీ అదిపుడు బట్ట విడిచేసింది. మనుషులను కులాలుగా చూస్తే దుష్ట సంప్రదాయం గత కొన్నాళ్ళుగా వికృత రూపం దాల్చింది. చంద్రబాబు నవ్యాంధ్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుల రాజకీయం ఊడలు వేసింది. ఇపుడు జగన్ ముఖ్యమంత్రి కావడంతో అది పరాకాష్టకు చేరుకుంటోంది. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి నోటి నుంచే కులాల పేర్లు వస్తున్నాయి. ఇది విపరిణామమేనని అంటున్నారు.వైసీపీ అధినాయకత్వం ఈ విషయాన్ని ఎక్కడా దాచుకోవడంలేదు. మరి.. ఇది వ్యూహమా లేక బరితెగింపా అన్నది అర్ధం కావడం లేదు కానీ పార్టీ పెద్ద జగన్ నుంచి దిగువ స్థాయి నేత వరకూ కమ్మ వర్గంపైన మాటల దాడి చేస్తూనే ఉన్నారు. జగన్ ఈసీ రమేష్ కుమార్ లో కులాన్ని చూడడంతో ఆయన పార్టీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. ఎక్కడా తగ్గకుండా తిట్ల పురాణం లంకుంచుకుంటున్నారు. మరో రాజ్యాంగబద్ధపదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అనేంతగా వెళ్ళిపోయారు. ఏపీలో కమ్మ వర్గం వారు దాష్టికాలు చేస్తున్నారంటూ మంత్రుల స్థాయి నేతలే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.ఇలా తమను టార్గెట్ చేయడం పట్ల టీడీపీలోని కమ్మ సామాజికవర్గం నేతలు గుస్సా అవుతున్నారు. సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే కమ్మ వారి మీద జగన్ కత్తికట్టాడని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కమ్మ వారి జోలికి వస్తే పతనం అయిపోతారని కూడా హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర కుమార్ చౌదరి అయితే ఇకా ముందుకెళ్ళి జగన్ కి కమ్మ కులం అక్కరలేదా? అని నిలదీశారు. తన వ్యాపారాల్లో పెట్టుబడులకు, రాజకీయ విక్త్రుత క్రీడలకు కమ్మవారు కావాలని, కానీ అధికారం విషయం వచ్చేసరికి మాత్రం కమ్మ కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు. కమ్మ వారు అధికారులుగా ఉండరాదని చెప్పండి. ఏపీలో కమ్మ వారు అసలు వద్దని కొత్త చట్టం తీసుకురండి అంటూ నరేంద్ర గట్టిగానే తగులుకున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అయితే వైసీపీలో ఉన్న కమ్మ వారంతా బయటకు రావాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వినూత్న డిమాండ్ చేశారు.కమ్మ సామాజికవర్గం వారు రాజకీయంగా చాలా ముందున్నారు. మెజారిటీ కమ్మ వారు టీడీపీని తమ సొంత పార్టీగా చూసుకున్నా చాలా మంది వివిధ పార్టీలలో కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా అనేక మంది కమ్మవారిని ఆదరించారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి అరుణ కుమారిని సొంత చెల్లెలుగా వైఎస్సార్ సమాదరించారు. ఆయన హయాంలోనే మాగంటి బాబు, లగడపాటి రాజగోపాల్ వంటి కమ్మ వారు రాజకీయంగా ముందుకువచ్చారు. జగన్ కి కూడా కమ్మ వారితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.జగన్ నిజానికి కులాల కుంపట్ల పట్ల పెద్దగా అసక్తిని చూపరు. కానీ ఆయన ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంగా ఈసీ కులాన్ని ప్రస్తావించడం ద్వారా పెద్ద తప్పు చేశారు. అక్కడితో ఆగకుండా వైసీపీ నేతలు కమ్మ వైరస్ అంటూ టార్గెట్ చేయడంతో ఆ కులం ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి శత్రువుగా మారుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని తరలింపుతో కమ్మ వారికి వైసీపీ వ్యతిరేకి అన్న ముద్ర పడింది. ఇసుక పాలసీ అయినా, రియల్ బూం తగ్గించడం అయినా, మద్య నిషేధం, సర్కార్ బడుల్లో ఆంగ్ల బోధన అయినా జగన్ తీసుకుంటున్న చర్యలు నేరుగా కమ్మ వారికే దెబ్బ కొడుతున్నాయి. దానికి తోడు అన్నట్లుగా మాటలతో కూడా రెచ్చిపోతే రాజకీయంగా బలమైన చైతన్యవంతమైన ఆ సామాజికవర్గం వైసీపీకి దూరమవడం ఖాయం. అదే జరిగితే వైసీపీకి కొత్త ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

Related Posts